సీఎం అవ్వాలని కోరికగా ఉంటే ఒక సినిమా తీసుకో

సీఎం పదవి కావాలంటే నీ సినిమాలో తప్ప బయట అవకాశం లేదు అంటూ అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌పై వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్‌కళ్యాణ్‌కు దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి ఓడించాలని ద్వారంపూడి ఛాలెంజ్ విసిరారు.

సీఎం అవ్వాలని కోరికగా ఉంటే ఒక సినిమా తీసుకో
New Update

publive-image

కాకినాడ ఎమ్మెల్యే తాజాగా జనసేనాధినేతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు తన మీద పోటీ చేస్తానని పవన్ ప్రకటిస్తాడని ఎదురుచూశానని.. కానీ తోక ముడుచుకొని వెళ్లిపోతుడున్నాడని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. తన మీద పోటీ చేస్తానని పవన్ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం తీసుకోలేదంటే.. పవన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నట్టే కదా అని అన్నారు. ఒక స్ట్రాటజీతో చంద్రబాబు ఇచ్చిన ప్లాన్ ప్రకారం పవన్ తన వారాహి యాత్ర చేస్తున్నాడని.. చంద్రబాబు ఆడిస్తే ఇతను ఆడుతున్నాడని విమర్శించారు.

ముద్రగడ సలహాతోనే పోటీ

కాపులు, రెడ్లు కలిసే ఉన్నారన్నారు. చంద్రబాబు చెప్పు చేతల కింద పవన్ పార్టీ ఉందని, కేవలం తనని తిట్టడానికే పవన్ ఇక్కడికి వచ్చాడని అన్నారు. తాను కాకినాడ నుంచి వెళ్లేలోపు పవన్ తన మీద పోటీ చేస్తానని చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. తనపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు అనుకుంటానన్నారు. ముద్రగడ ప్రకటన చేయడం చాలా సంతోషమని, తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ముద్రగడ సలహా తీసుకుని.. పవన్ తన మీద పోటీ చేయాలని సూచించారు.

నీ కోరికలు సినిమాలో తీర్చుకో..

అంతకుముందు కూడా.. పవన్‌కళ్యాణ్‌కు దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి ఓడించాలని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే.. పవన్ చేసిన ఆరోపణలన్నీ నిజమని ఒప్పుకుంటానన్నారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. తన సవాలు స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యే లేదా ముఖ‌్యమంత్రి కావాలనే పవన్ కోరిక కేవలం సినిమాల్లో తీరుతుందే తప్ప బయట తీరదని.. సీఎం అవ్వాలని అంత కోరికగా ఉంటే ఒక సినిమా తీసుకోవాలని ఎద్దేవా చేశారు. పవన్ కేవలం చంద్రబాబును ఉద్దరించడానికి పార్టీ పెట్టాడని ఆరోపించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ జీరో అని విమర్శించారు. పవన్ రోజుకో మాట చెప్తుంటారని.. మార్చి 14న తనకు సీఎం అయ్యే బలం లేదన్న పవన్, జూన్ 14న కత్తిపూడిలో తనని సీఎం చేయాలని వేడుకున్నారని గుర్తు చేశారు. మధ్యలో ప్యాకేజీ కోసం చంద్రబాబు దగ్గరకు కూడా పవన్ వెళ్లాడని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe