TS: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌..!

హైదరాబాద్ - జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడికి బాలుడు బలయ్యాడు. విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తిన్నాయి. స్పందించిన సీఎం రేవంత్.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

New Update
TS: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌..!

Stray Dogs Attack:  రోజూ రోజుకు వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా, వీధి కుక్కల దాడికి ఒక బాలుడు బలయ్యాడు. హైదరాబాద్ (Hyderabad) - జవహర్ నగర్ పరిధిలోని ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదర్శనగర్ కాలనీలో ఆడుకుంటున్న విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. విహాన్ నెత్తి భాగాన్ని కుక్కల గుంపు  పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. బాలుడి కేకలతో అప్రమత్తమైన కుటుంబసభ్యలు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు.

Also Read: ఘోర ప్రమాదం.. రియాక్టర్‌ పేలడంతో ఒకరు మృతి..!

అంతేకాకుండా జగిత్యాల - బీర్పూర్ మండలం మంగెలలోనూ ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్(7) అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలు అయ్యాయి. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలా పలుచోట్ల కుక్కల దాడులు ఎక్కువ జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వీధి కుక్కలను అదుపుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మిస్టరీగా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు..!

ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కుక్కల దాడిలో బాలుడి మృతిపై విచారం వ్యక్తం చేశారు. బాలుడి మృతి కలిచివేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. పశు వైద్యులు, బ్లూక్రాస్‌ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. కుక్కలు దాడి చేస్తే అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు