/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/holidays-1-jpg.webp)
Dussehra Holidays: జేఎన్టీయూ కాలేజ్, హైదరాబాద్(JNTU college of engineering,Hyderabad ) ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవుల(Dussehra holidays) షెడ్యూలులో మార్పులు చేస్తూ ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా సెలవులను మరొకరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వగా.. 25న కూడా సెలవుగా ప్రకటించారు. దూరప్రాంతాలకు వెళ్లే వారికి తిరిగి రెండు రోజుల్లో రావాలంటే ఇబ్బంది కలుగుతుందని విద్యార్ధుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్‌లో ఆ స్టార్ బౌలర్!
వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసేది దసరా సెలవుల కోసమే. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థుల అయితే ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ నెల 22 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వడంతో కాస్త నిరాశగా ఫీల్ అయ్యారు.దీంతో దూరప్రాంతాలకు వెళ్లి పండుగరోజే వెనక్కి రావాల్సి వస్తుందని, మరొకరోజు సెలవు కావాలని విద్యార్థులు రిక్వెస్టు చేయడంతో ప్రిన్సిపాల్ అందుకు ఒకే చెప్పారు. దసరా సెలవులను మరొకరోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్ రిక్వెస్టుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. దసరా సెలవుల నేపథ్యంలో నాలుగురోజుల పాటు జేఎన్‌టీయూలోని అన్ని బాలుర, బాలికల వసతిగృహాలను మూసివేస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఒకవేళ సెలవు రోజుల్లో సొంతూళ్లకు వెళ్లని విద్యార్థులు ఎవరైనా ఉంటే.. వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
Follow Us