ఆస్పత్రిలో దుర్గం చిన్నయ్య బాధితురాలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. తనకు న్యాయం జరగడం లేదంటూ శేజల్ రెండో సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

New Update
ఆస్పత్రిలో దుర్గం చిన్నయ్య బాధితురాలు

Durgam Chinnayya who was admitted to the hospital for the second time

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. తనకు న్యాయం జరగడం లేదంటూ నిన్నశేజల్ రెండో సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈరోజు ఉదయమే శేజల్‌ను పోలీసులు డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లారు. లాంకోహిల్స్‌లోని శేజల్ నివాసం వద్ద వదిలి వెళ్లారు. అయితే పోలీసులు బలవంతంగా తనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. తన ఆరోగ్యం కుదుట పడలేదని మళ్లీ మాదాపూర్ ఆస్పత్రిలో చేరారు. తనకు తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే చనిపోతానని మరోసారి శేజల్ హెచ్చరించారు.

అపస్మారక స్థితిలో శేజల్

కాగా.. నిన్న పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్ అపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె బ్యాగులో నిద్రమాత్రలు, సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పెద్దమ్మ గుడి వద్ద శేజల్‌ను ఆదినారాయణ అనే వ్యక్తి వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ సర్కారు తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని శేజల్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. మాదాపూర్ వద్ద రోడ్డుపై శేజల్ నిద్రమాత్రలు మింగిననట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నానని ఆమె పేర్కొన్నారు.

న్యాయం కోసం పారాటం

ఢిల్లీలోనూ కొన్నిరోజుల క్రితం శేజల్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. సూసైడ్ నోట్‌లో శేజల్ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని శేజల్ ఆరోపిస్తున్నారు. 6 నెలల నుంచి న్యాయం కోసం పోరాటుతున్నట్లు సూసైడ్ నోట్‌లో శేజల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని మాట తప్పారని ఆమె ఆరోపించారు.

కేటీఆర్ రాజీనామా చేయాలి

ఇక.. ఈ ఘటనలపై కేఏ పాల్‌ స్పందించారు. ఆస్పత్రి వద్దకు వెళ్లి శేజల్‌కు ప్రార్థన చేశారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని పాల్ మీడియాకు చెప్పారు. 45 రోజుల నుంచి పోరాటం చేస్తోన్నా.. ఇంతవరకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. కేవలం కేటీఆర్ మాటలతోనే శేజల్‌ ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. చిన్నయ్య లాంటి పనికిమాలిన ఎమ్మెల్యేను అసెంబ్లీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిని రాజకీయం చేయడం కాదు.. తప్పు చేసిన ఎవరికైనా శిక్షపాడాలి.. అందరిలో మార్పు రావాలని పాల్ అన్నారు. యువతకి దయచేసి చెబుతున్న ఏ విషయంలో అయిన ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మనకి మంచి రోజులు వస్తున్నాయని పాల్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు