AP: రైతు వినూత్న ఆలోచన.. గాడిద పాలు అమ్మి లక్షల్లో సంపాదిస్తున్నాడు..!

ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ రైతు వినూత్న ఆలోచన చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు. గాడిద పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రూ.7 లక్షలతో ఏకంగా 40 గాడిదలు కొని ఫామ్ ఏర్పాటు చేశాడు రైతు దుర్గారావు. లీటర్ గాడిద పాలు రూ.2 వేలకు పైబడి అమ్ముతూ లక్షాధికారి అయ్యాడు.

New Update
AP: రైతు వినూత్న ఆలోచన.. గాడిద పాలు అమ్మి లక్షల్లో సంపాదిస్తున్నాడు..!

West Godavari: ఓ రైతు వినూత్న ఆలోచన చేసి ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో గాడిద పాలు అమ్మి లక్షల్లో సంపాదిస్తున్నాడు రైతు దుర్గారావు. గాడిద పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో గాడిద ఫామ్ ఏర్పాటు చేశాడు. రూ.7 లక్షలతో ఏకంగా 40 గాడిదలు కొని ఫామ్ పెట్టాడు. లీటర్ గాడిద పాలు రూ.2 వేలకు పైబడి అమ్ముతోన్నాడు.

Also Read: ఇలాంటి సంప్రదాయం ఆపండి.. చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక..!

మార్కెట్లో డిమాండ్ ను బట్టి ఒక్కోసారి రూ.2 వేలకు పైగానే డబ్బులు వస్తున్నాయని దుర్గారావు చెబుతోన్నాడు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా కొందరు వచ్చి పాలు తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఫామ్ ను ఇంకా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఎవరైనా ఈ వ్యాపారం చేయవచ్చని, గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందని సూచిస్తున్నాడు.

Advertisment
తాజా కథనాలు