Jagan: ఇలాంటి సంప్రదాయం ఆపండి.. చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక..!

కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత అజయ్ రెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పులివెందులలో చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెర లేపారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి దాడులను ఆపాలని హెచ్చరిస్తున్నానన్నారు.

New Update
Jagan: ఇలాంటి సంప్రదాయం ఆపండి.. చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక..!

YS Jagan: వైసీపీ నేత అజయ్ రెడ్డిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. టీడీపీ నేతల దాడిలో ఆయన గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వ్యక్తి అని అదే పనిగా వాహనాల్లో వచ్చి ఆసుపత్రి పాలు చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఇలాంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: అందుకే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి

ఎన్నికల తర్వాత అంతా కలిసి వుండే పరిస్థితి అని.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చెడు సంప్రదాయానికి తెర లేపారన్నారు. భయాందోళన వాతావరణం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులను ఆపాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నానన్నారు.

Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్‌.. అక్రమనిర్మాణాలపై కొరడా..!

వ్యవస్థను గాడిలో పెట్టాలని.. మోసపురిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓట్లశారని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయన్నారు. ఇంతవరకు స్కూల్ బాగ్స్ అందించలేదని.. అతిసారాతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు