Hydra: హైదరాబాద్‌లో ఆ 8విల్లాల కూల్చివేత.. మరో 12 విల్లాలకు నోటీసులు! హైదరాబాద్‌లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే 8 విల్లాలు కూల్చగా మరో 12 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. ఈ కూల్చివేతలపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 08 Sep 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad hydra: హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు మరింత పెరిగింది. గత వారం వర్షాల కారణంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చిన అధికారులు మరోసారి కూల్చివేతలు మొదలుపెట్టారు. ప్రస్తుంతం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే ఈ చెరువు స్థలంలో నిర్మించిన 8 విల్లాలను సైతం నెలమట్టం చేయగా.. మరో 12 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. 15 ఎకరాల చెరువు స్థలంలో విల్లాలు.. ఈ మేరకు కత్వా చెరువు స్థలం ఆక్రమణకు గురైందని స్థానికుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన హైడ్రా.. లక్ష్మి శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మొత్తం 330 విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. అయితే అందులో FTL, బఫర్‌జోన్‌లో సుమారు 15 ఎకరాల చెరువు స్థలంలోనే విల్లాలు నిర్మించినట్లు గుర్తించింది. దీంతో 8 విల్లాలను ఎక్కడికక్కడ కూల్చివేసింది హైడ్రా. అయితీ ఈ కూల్చివేతలపై విల్లా యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని పర్మిషన్లతోనే విల్లా కట్టుకున్నామని, నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించకుండా మా ఇళ్లను ఎలా కూలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై కేవలం కేసు పెట్టి వదిలేస్తే సరిపోదని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. #dundigal-katwa-lake #hydra-action #20-villas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి