/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dulquer-jpg.webp)
Dulquer Salman Drops Hints About Being Part Of Prabhas Deepika Padukone Film Kalki: మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ఆగస్ట్ 24న విడుదల కానున్న కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో, దుల్కర్ ఇప్పటికే ప్రభాస్ కల్కి 2898 ADలో తాను భాగం అవుతానని పరోక్షంగా ధృవీకరించాడు. ఇప్పుడు అతను మరో సినిమాలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా అతడే బయటపెట్టాడు. త్వరలోనే సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. ఈ సినిమాలో కీలక పాత్రలో దుల్కర్ కనిపించనున్నాడు. తాను ఈ సినిమా చేస్తున్నానని చెప్పిన దుల్కర్.. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించడానికి నిరాకరించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో బిజీ అవుతున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు సూర్య. ప్రస్తుతం అతడు తన కెరీర్ పై ఫుల్ గా ఫకస్ పెట్టాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ నటుడు ప్రస్తుతం తన పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నాడు. సంప్రదాయ సినిమాల కంటే కాస్త విభిన్నంగా ఉండే కథలు ట్రై చేయాలనుకుంటున్నాడు.
మరోవైపు, దుల్కర్ కూడా.. తన మాతృభాష మలయాళంలో సినిమాలు చేస్తూనే.. తమిళం, తెలుగు, హిందీలో ఎక్కడ మంచి కథలు దొరికితే అక్కడ నటించడానికి రెడీ అవుతున్నాడు. హీరో పాత్రలే చేయాలనే నిబంధన అస్సలు పెట్టుకోవడం లేదు. పాన్ ఇండియా నటుడిగా మాత్రమే ఎదగాలని అనుకుంటున్నాడు. సో.. ఇటు సూర్య, అటు దుల్కర్ ఇద్దరూ ఒకే మైండ్ సెట్ తో ఉన్నారు. అలా వీళ్లిద్దరూ కలిశారు.
సుధా కొంగర ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో వీళ్లిద్దరూ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ ప్రారంభ దశలో ఉంది. తాజా నివేదిక ప్రకారం, సూర్య, దుల్కర్ ఇద్దరూ కలిసి పనిచేయడానికి ఇప్పటికే అంగీకరించారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఇంతకుముందు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కలిసి చేసిన ఆకాశం నీ హద్దురా సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంగీత విభాగంలో జాతీయ అవార్డ్ సైతం వచ్చింది. ఇప్పుడు మరోసారి సూర్య-సుధ కలిసి మరో ప్రయోగం చేయబోతున్నారు. వీళ్లకు దుల్కర్ యాడ్ అయ్యాడు.