Hyderabad: డ్యూలింగ్‌ ఎగ్జామ్ లో మాల్‌ ప్రాక్టీస్‌.. ఏడుగురు అరెస్ట్

డ్యూలింగ్‌ ఎగ్జామ్స్ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్‌ లోని వెంకటేశ్వర లాడ్జిలో ఎగ్జామ్ రాస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 పాస్‌పోర్టులు, 7 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Hyderabad: డ్యూలింగ్‌ ఎగ్జామ్ లో మాల్‌ ప్రాక్టీస్‌.. ఏడుగురు అరెస్ట్

Dueling Exams: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే డ్యూలింగ్‌ ఎగ్జామ్స్ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు వ్యక్తులు హయత్‌నగర్‌ (Hayath Nagar)లోని వెంకటేశ్వర లాడ్జిలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎల్బీనగర్‌ (LB Nagar) ఎస్‌వోటీ (SOT) పోలీసులు తెలిపారు.

హోటల్‌పై దాడి..
ఈ మేరకు ఆస్ట్రేలియా, అమెరికా, ఐర్లాండ్‌ల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పై చదువలకోసం ఈ డ్యూలింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులకు బదులు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను ప్రవీణ్‌ రెడ్డి, హరినాథ్‌, కృష్ణ, అరవింద్‌ రెడ్డి, సంతోష్‌, వినయ్‌, నవీన్‌ కుమార్‌లు రాస్తున్నట్లు నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: Crime: పోర్న్ సినిమాల్లాగా చేయాలంటూ భార్యపై ఒత్తిడి.. అత్తా, మరిది సైతం

5-10 వేల రూపాయలు..
దీంతో వెంటనే హోటల్‌పై దాడి చేసిన నిందులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే పరీక్ష రాసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి 5-10 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 పాస్‌పోర్టులు, 7 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు