ఆడవారి కన్నా మగవారికి బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది!

మగవారి, ఆడవారి శరీరాలు డిఫరెంట్‌గా ఉంటాయి. దీని కారణంగా, కొవ్వు పెరిగినప్పుడు ఇద్దరికీ వేర్వేరు భాగాల్లో బాడీ పెరుగుతుంది. అసలు ఆడవారి కన్నా మగవారికి బెల్లీ ఫ్యాట్ పెరగటం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

New Update
ఆడవారి కన్నా మగవారికి బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది!

ఆడ, మగవారి హార్మోన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా వారి భౌతిక నిర్మాణం, సంస్కృతి, సామాజిక అంశాల కారణంగా ఉంటుంది. కొన్ని హార్మోన్స్ కొవ్వు నిల్వ, జీవక్రియని ప్రభావితం చేస్తాయి. ఆహారం, శారీరక, శారీరక కారకాలు కూడా మగ, ఆడవారిలో కొవ్వు కేంద్రంలో తేడా ఉంటుంది. అదే విధంగా, మగవారు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొంటారు. కానీ, ఆడవారు అంతగా ఎక్కువగా వర్కౌట్ చేయరు.

మగ, ఆడవారిలో కొవ్వు నిల్వలు వేర్వేరుగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం హార్మోన్స్. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆడవారికి నడుము, పిరుదుల ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోతుంది. కానీ, మగవారికి అలా కాదు. త్వరగా పొట్ట పెరుగుతుంది. ఎందుకంటే, ఆడవారిలో మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. తుంటి నుండి తొడలు, పొత్తికడుపు వరకూ తగ్గుతుంది. అందుకే, ఆడవారు మెనోపాజ్ టైమ్‌లో బరువు పెరుగుతారు.హార్మోన్స్ కారణంగా ఆడ, మగవారి బాడీలో వివిధ చోట్ల కొవ్వు పేరుకుపోతుంది.

మగవారికి కడుపు ప్రాంతంలో పేరుకుపోతుంది. అందుకే, ఆడవారికంటే మగవారికి పొట్ట త్వరగా పెరుగుతుంది. కానీ, మహిళల హార్మోన్స్ కారణంగా తొడ, నడుము ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.అధిక బరువు కారణంగా గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ పెరుగుతాయి. ఆడవారిలో అధికబరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్, మెటబాలిక్ సిండ్రోమ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి.అధిక బరువు కారణంగా శరీరం లావుగా మారడం ఆడ, మగవారిలో డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ ప్రమాదం మాత్రం ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. ఆడవారిలో జీవక్రియ మగవారి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ హార్మోన్స్ చేంజెస్, జీవనశైలి కారణంగా అధికబరువుతో బాధపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు