Road Accident: ప్రకాశం జిల్లా టంగుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోల్‌ప్లాజాకు దగ్గర్లో NH 16పై పెళ్లి బృందం కారు బోల్తా పడింది. కారు పల్టీ కొట్టి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కకడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
Also Read: పవన్ కల్యాణ్ పిలిస్తే అందుకు సిద్ధం: అనసూయ
ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలంలో పెళ్లికి హాజరై కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.