AP: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు..!

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ.. స్కూల్‌ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద చోటుచేసుకుంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ.. స్కూల్‌ బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి వద్ద జరిగింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థుల దగ్గరకు చేరుకున్నారు.

Also Read: ఆర్టీసీ బస్టాండ్‌లో భారీ చోరీ.. రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం అదృశ్యం..!

ఈ ఘటనపై రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. 'కావలి సమీపంలో ఈరోజు పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్ లో ఉంచుకోవాలి. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను'. అంటూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు