Maldives Dispute : మాల్దీవుల వివాదం.. ఆ రెండు షేర్లకు రెక్కలు.. మీ దగ్గర ఉన్నాయా? 

మాల్దీవుల వివాదంతో భారత్ లోని రెండు కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో రిసార్ట్స్ నడిపే ప్రవేగ్  షేర్లు 20 శాతం జంప్ అయ్యాయి. ఇక ఈజీ మై ట్రిప్ సంస్థ షేర్లు రెండు శాతం పెరిగాయి. మరోవైపు మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. 

Maldives Dispute : మాల్దీవుల వివాదం.. ఆ రెండు షేర్లకు రెక్కలు.. మీ దగ్గర ఉన్నాయా? 
New Update

Maldives Dispute : ఒక్కోసారి ఒక్క మాట.. చాలా పరిస్థితులను తారుమారు చేస్తుంది. నోరు జారిన ఆ ఒక్క క్షణం నష్టాల మూటను మోసుకొస్తుంది. అది వ్యక్తి అయినా.. వ్యవస్థ అయినా.. దేశమైనా.. మాట జాగ్రత్తగా వాడాలని పెద్దలు చెప్పేది అందుకే. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. భారతదేశంపై మాల్దీవుల(Maldives) మంత్రి ఒకరు చేసిన పొరపాటు వ్యాఖ్యానం.. వారి టూరిజంపై కోలుకోలేని పెద్ద దెబ్బ కొట్టింది. అయితే అదే సమయంలో భారతదేశం(India) లోని లక్షద్వీప్(Lakshadweep) కి సంబంధించిన ప్రతి చిన్న విషయమూ ఇప్పుడు హాట్ టాపిక్(Hot Topic) గా మారిపోయింది. వ్యాపారానికి సంబంధించి.. కూడా ఈ వివాదం చాలా విషయాలను మార్చేస్తోంది. అవేమిటో ఓ లుక్కేద్దాం.. 

ప్రవేగ్ స్టాక్.. 
భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని(Maldives Dispute) లక్షద్వీప్ సంబంధిత స్టాక్ 'ప్రవేగ్'(Praveg) సద్వినియోగం చేసుకుంటోంది. టూరిస్ట్ ప్లేసెస్‌లో లగ్జరీ రిసార్ట్‌లను నడుపుతున్న ప్రవేగ్ అనే కంపెనీ షేర్లు జనవరి 8న 20% పెరుగుదలతో 52 వారాల గరిష్ట స్థాయి ₹1,037.50ని తాకాయి. అయితే, రోజు ట్రేడింగ్ తర్వాత, స్టాక్ స్వల్పంగా తగ్గి 17.51% లాభంతో ₹1,015.95 వద్ద ముగిసింది.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత తమ ప్లాట్‌ఫారమ్‌లో లక్షద్వీప్‌లో సెర్చ్‌లు 3400% పెరిగాయని ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేక్ మై ట్రిప్ 'బీచ్ ఆఫ్ ఇండియా'ను ప్రారంభించింది. అంతేకాకుండా, EaseMyTrip మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేసింది.

ప్రవేగ్ ఏం  చేస్తుంది? 
ఒకసారి ప్రవేగ్ కంపెనీ గురించి చూద్దాం. గత నెల, లక్షద్వీప్ ప్రభుత్వం ప్రవేగ్‌కు పర్యాటక కేంద్రంగా విలాసవంతమైన రిసార్ట్‌లను నిర్వహించే సంస్థను ఇచ్చింది. రాన్ ఆఫ్ కచ్ వంటి ప్రదేశాలు, అగట్టి ద్వీపంలో 50 కంటే ఎక్కువ గుడారాల అభివృద్ధి, నిర్వహణ పనులు అప్పచెప్పారు.  ప్రవేగ్ లక్షద్వీప్‌లోని రిసార్ట్‌ల నిర్వహణ, స్కూబా డైవింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, ఇతర వ్యాపార కార్యకలాపాలతోపాటు కార్పొరేట్ ఫంక్షన్‌లను అందిస్తుంది. ప్రవేగ్‌కు లక్షద్వీప్ అసైన్‌మెంట్ మూడేళ్లపాటు ఇచ్చారు. తరువాత కూడా  దానిని 2 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇప్పుడు వివాద నేపథ్యంలో లక్షద్వీప్ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య బాగా పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు. దీంతో ప్రవేగ్  కంపెనీ ఒక్కసారిగా బూస్ట్ అయింది. 

EaseMyTrip ఏం చేసింది?
ఇక EaseMyTrip మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేసింది. EaseMyTrip సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఈ సమాచారాన్ని అందించారు. నిశాంత్ పిట్టి మాట్లాడుతూ, 'ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల ఎంపీ పోస్ట్ వివాదం మధ్య, మేము మాల్దీవులకు ఎటువంటి బుకింగ్‌లను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాము.

Also Read: అమ్మకాల ఒత్తిడి.. స్టాక్ మార్కెట్ క్రాష్.. ఎందుకంటే.. 

మన దేశం నుంచి ఏటా 3 లక్షల మంది మాల్దీవులకు(Maldives Dispute) వెళ్లేవారు, ఇప్పుడు ఈజ్‌మైట్రిప్‌లో ఈ సౌకర్యాన్ని పొందలేరు. అంటూ ట్వీట్ చేశారు. ఇదే సందర్భంలో ' లక్షద్వీప్‌లో పర్యాటకులను ప్రోత్సహించేందుకు, మా ప్లాట్‌ఫారమ్‌లో 5 కొత్త ప్యాకేజీలను కూడా ప్రారంభించామని నిశాంత్ చెప్పారు.' ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ పేరుతో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన EaseMyTrip షేర్లలో కూడా జనవరి 8న  4.71% పెరుగుదల కనిపించింది.

ఒక్క మాట.. ఒక్క వివాదం.. ఒక్కోసారి కొందర్ని ముంచేస్తే.. కొందర్ని ఎక్కడికో తీసుకువెళ్లిపోతాయి. స్టాక్ మార్కెట్ విషయంలో చలామణి చెప్పే లాటరీ అనే పదాన్ని ఈ వివాదం నిజం చేస్తున్నట్టు అనిపిస్తోంది కదూ. అన్నట్టు అసలు వివాదం ఏమిటో కూడా ఒకసారి చెప్పేసుకుందాం.. 

అసలేం జరిగిందంటే.. 
PM మోడీ జనవరి 4న లక్షద్వీప్‌లో తన పర్యటన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో లక్షద్వీప్ ఇప్పుడు అందాల పరంగా మాల్దీవులతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. దీని తర్వాత, మాల్దీవులకు(Maldives Dispute) వెళ్లడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయడం కంటే లక్షద్వీప్‌కు వెళ్లడం మంచిదని సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం ప్రారంభం అయింది. దీంతో మాల్దీవుల మంత్రులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా నోరు పారేసుకున్నారు. వారి  అభ్యంతరకర పోస్ట్ తర్వాత, సోషల్ మీడియాలో భారతీయులు - మాల్దీవుల నెటిజన్ల  మధ్య కామెంట్స్ యుద్ధమే జరిగింది. భారత ప్రజల ఆగ్రహం ఎంతగా పెరిగిందంటే, దెబ్బకు  బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్‌ట్యాగ్ దేశంలో ఫుల్ ట్రెండ్ లోకి వచ్చేసింది. ఈ సంఘటనతో భారతీయలు  మాల్దీవులను(Maldives Dispute) తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల పర్యాటక రంగానికి కచ్చితంగా పెద్ద దెబ్బేనని ప్రజలు అంటున్నారు. మరోవైపు, నెటిజన్లు #ExploreIndianIslandతో భారతదేశ పర్యాటక రంగానికి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.

అదండీ విషయం నోటిని అదుపులో ఉంచుకోకపోతే.. ఉన్నది ఎలా ఊడిపోతుందో అర్ధం అయింది కదా.. ఏటా లక్షలాదిమంది భారతీయులు మాల్దీవులకు ట్రిప్పులు వేసేవారు. వారి నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అనవసర దూకుడుతో ఇప్పుడు వారి పర్యాటక ప్రాంతం వెల వెల పోయే పరిస్థితి వచ్చింది.

Watch this interesting Video:

#maldives-dispute #lakshadweep-tour #boycottmaldives
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe