Krishna: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల వేధింపులతో ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కొల్లిపర శివకుమార్ అనే వ్యక్తి కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: వైసీపీ MPTC దారుణ హత్య..!
రూ.70,000 అప్పు తీసుకుంటే 10 లక్షల కట్టాలని బెదిరించారని ఖాదర్ ఖాన్ కుమారుడు ఆరోపించాడు. వాళ్ల బెదిరింపులు కారణంగానే తన తండ్రి చనిపోయాడని వాపోతున్నాడు. తన తండ్రి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు.