భూనిర్వాసితులతో దుబ్బాక ఎమ్మెల్యే బస్సులో ప్రయాణం

తెలంగాణ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామస్తుల సమస్యలను అధికార ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తుక్కాపూర్‌లో ధ్వంసమైన డంపింగ్‌ యార్డ్.. స్మశాన వాటికను మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్‌కు గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణమైయ్యారు దుబ్బాక ఎమ్మెల్యే.

New Update
భూనిర్వాసితులతో దుబ్బాక ఎమ్మెల్యే బస్సులో ప్రయాణం

Dubbaka MLA travels in bus with IDPs

తుక్కాపూర్ గ్రామస్తులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ బయల్దేరారు. తుక్కాపూర్ గ్రామంలో ధ్వంసమైన డంపింగ్ యార్డ్, స్మశాన వాటికను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. రాత్రికి రాత్రి తుక్కాపూర్ గ్రామానికి చెందిన స్మశాన వాటిక మరియు డంపింగ్ యార్డ్ ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కాపూర్ భూ నిర్వాసితులతో కలిసి బస్సులో కలెక్టరేట్‌ దుబ్బాక ఎమ్మెల్యే ప్రయాణం చేస్తున్నారు.

Dubbaka MLA travels in bus with IDPs

అయితే తోగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో మొన్న రాత్రికి రాత్రి కొందరు ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యక్తులు గ్రామానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ మరియు స్మశాన వాటిక ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే. సంఘటన స్థలం నుంచి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే.. సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌కు బయలుదేరారు.

Dubbaka MLA travels in bus with IDPs

తుక్కపూర్ గ్రామానికి గతంలో ఇస్తానన్న ప్లాట్లు వెంటనే మంజూరు చేయాలని, గ్రామంలో నూతనంగా మళ్ళీ డంపింగ్ యార్డ్ మరియు స్మశాన వాటికను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని, గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న సబ్‌ స్టేషన్ నుండి సిద్దిపేట వెళ్లే రింగ్ రోడ్డు సమస్య పరిష్కరించి దారి ఇవ్వాలని లేదా నూతనంగా బ్రిడ్జ్ నిర్మించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు