AP Politics: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: పోలీసులు

జూన్‌ 4న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానున్నంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా DSP బాల సుందర్రావ్ హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.

New Update
AP Politics: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: పోలీసులు

AP Politics: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేశారు ఏపీ అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అయితే... కౌంటిగ్‌లో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించిన తర్వాత ఈవీఎం బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు.

బయట ప్రాంతాలవారు నగరంలో ఉండకూడదు:

రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా DSP బాల సుందర్రావ్ హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జూన్ 4వ తేదీన 144 సెక్షణ అమలలో ఉంటుందన్నారు. బయట ప్రాంతాలవారు నగరంలో ఉండకూడదని పోలీసులు పేర్కొన్నారు.ఊరేగింపులు.. బానసాచాలు లాంటివి పూర్తిగా నిషేధం చేస్తున్నామని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు.. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని ప్రజలు ఏపీ పోలీసులు సూచినలు చేశారు.

ఇది కూడా చదవండి: నిమ్మకాయతో మీ గోళ్లను పొడవుగా, అందంగా మార్చుకోవచ్చు.. ఎలాగంటే?

Advertisment
తాజా కథనాలు