TG DSC: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి! తెలంగాణలో మరి కొద్ది సేపటిలో డీఎస్సీ పరీక్ష ప్రారంభం కానుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది.ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. By Bhavana 18 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana DSC Exam: తెలంగాణలో మరి కొద్ది సేపటిలో డీఎస్సీ పరీక్ష ప్రారంభం కానుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. గురువారం నుంచి డీఎస్సీ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాత్రం అరగంట ఎక్కువసేపు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని విద్యాశాఖ తెలిపింది .అభ్యర్థులు పరీక్షకు పది నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించబోమని వివరించింది. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యక్తిగత వస్తువులను అనుమతించబోమని ముందుగానే వివరించింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్, వ్యక్తిగత గుర్తింపు కార్డును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే పరీక్ష జరిగే కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి సమావేశం కాకూడదని అధికారులు సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. Also Read: నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి! #telangana #dsc-exam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి