Health Tips: వీటిని ఖాళీ కడుపుతో తిన్నారో.. మీ పని అంతే

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంజీర్, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరను ఏమీ తినకుండా తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Health Tips: వీటిని ఖాళీ కడుపుతో తిన్నారో.. మీ పని అంతే
New Update

Health Tips: సహజంగా డైలీ డైట్ లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్స్, క్యాల్షియం, మైక్రో న్యూట్రియెంట్స్, మినరల్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాదు డ్రై ఫ్రూట్స్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి పోరాడతాయి. అయితే వీటిలో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తింటే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టి తింటే ఎలాంటి ప్రభావం ఉండదు.. కానీ నేరుగా వీటిని తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో హై ఫైబర్ తో పాటు సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ఇవి కడుపులో ఇబ్బందిని కలిగిస్తాయి. గ్యాస్, కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

అంజీర్

అంజీర్ నేరుగా ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదు. కడుపులో ఏ ఇతర ఆహారాల సమ్మేళనం లేకపోవడంతో వీటిలోని హై ఫైబర్ జీర్ణమవడానికి ఇబ్బంది కలుగుతుంది. దీంతో గ్యాస్, కడుపుబ్బరం సమస్యలు వస్తాయి.

జీడిపప్పు

జీడిపప్పు ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎంప్టీ స్టమక్ తో వీటిని తీసుకుంటే జీర్ణమవడానికి ఇబ్బంది కలుగుతుంది. అంతే కాదు ఉదయాన్నే హెవీ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

publive-image

ఖర్జూర

కడుపులో ఏమీ లేకుండా ఉదయాన్నే ఖర్జూరాలు తీసుకుంటే.. వీటిలోని హై ఫైబర్ జీర్ణక్రియకు ఇబ్బందిని కలిగిస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఖాళీ కడుపుతో ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే.. జీర్ణమవడానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే వీటిని నేరుగా కాకుండా ఏదైనా ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటే మంచిది. లేదా నానబెట్టినవి కూడా తీసుకోవచ్చు.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి : పీరియడ్స్‌ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ఇలా తెలుసుకోవచ్చు

#dry-fruits #digestive-issues
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe