/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Drugs-are-creating-chaos-in-Hyderabad-jpg.webp)
డ్రగ్స్ సేవిస్తున్న వారు అరెస్ట్
భాగ్యనగర్‌లోని మాదాపూర్‌లలో మరోకసారి డ్రగ్స్ కలకలం రేపింది. నిన్న రాత్రిమాదాపూర్‌లోని అపార్టుమెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా దాడి నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ సేవిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు నార్కోటిక్ బ్యూరో.ఘటనాస్థంలో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దొరికిన వారిలో ఒకరు సినీ నిర్మాత వెంకట్‌తో పాటు, పలువురు ప్రముఖులను, పలువురు అమ్మయిలను అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలో ఉన్న మాదాపూర్ పీఎస్‌కు నిందితులను అప్పగించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణ వేగవంతం
మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లోని డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. సినిమా ఫైనాన్సర్ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరుగుతున్నట్లు గుర్తించారు.డమరుకం, పూల రంగుడు,లైవ్లీ,ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్‌గా వెంకట్ పని చేశాడు.బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.బాలాజీ,కె.వెంకటేశ్వర్‌రెడ్డి,డి.మురళి,మధుబాల,మేహక్‌ను అరెస్ట్ చేశారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్ డ్రగ్స్ పార్టీలు నిర్వయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టినట్లు సమాచారం.వెంకట్‌కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలుపై ఆరా తీసుకున్నారు.వెంకట్ వాట్సప్ చాట్‌లో డ్రగ్స్ పార్టీపై చాటింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు.
అయితే వెంకట్ ఫోన్ మిస్ అయినట్లు తెలిపారు. వెంకట్ దగ్గర lsd డ్రగ్స్‌తో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.వెంకట్ వీకెండ్‌లో డ్రగ్స్ పార్టీ పెడుతున్నట్లు దర్యాప్తులో పోలీసులు తేల్చారు. అయితే వెంకట్ ఫోన్ ఎలా మిస్ అయ్యింది అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట్ ఫోన్ మిస్ చేశాడా? లేక ఫోన్‌లో పెద్దవాళ్ల నెంబర్లు ఉండటం వలన ఎవరైనా తీసారా అనే దానిపై ఆరా ఫోకస్ పెట్టారు.ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చింది..? డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు..? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావించారు. అయితే, కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. పలువురు సినీ ప్రముఖులను అరెస్ట్‌తో తాజాగా మరోసారి సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Follow Us