/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-17-12-jpg.webp)
Drishyam Movie: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్, రీమేక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందంటే వాటికి సీక్వెల్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణం. ఇందులో ఒకటి దృశ్యం మూవీ. ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన అరుదైన చిత్రాల్లో ఇది ఒకటి. 2013 లో మలయాళంలో మోహన్ లాల్, ఆశా శరత్, సిద్ధిక్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఏకంగా 7 బాషల్లో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం. ఇప్పటికే పలు బాషల్లో ఈ సినిమా పార్ట్ 1 తో పాటు పార్ట్ కూడా రిలీజ్ అయిపోయాయి.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్
హాలీవుడ్ లో 'దృశ్యం' మూవీ రీమేక్
అయితే బ్లాక్ బస్టర్ చిత్రంగా ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ.. తాజాగా మరో ఘనత సాధించింది. తెలుగు, హిందీ, తమిళ్ కాదు ఏకంగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి భారతీయ చిత్రంగా దృశ్యం రికార్డు సాధించింది.
ఇప్పటికే ఎన్నో భాషల్లో రీమేకైన ఈ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ లో కూడా రావడం విశేషం. తెలుగులో, హిందీ మలయాళ భాషల్లో 'దృశ్యం' పేరుతో, కన్నడలో 'పాపనాశం' పేరుతో తెరకెక్కింది.
Also RPrabhas Spirit Movie: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ