Health Tips: తినడానికి ముందు నీరు తాగితే అనేక లాభాలు!

ఏదైనా తినటానికి ముందే నీరు తాగితే అనేక లాభాలు ఉంటాయి. ఎసిడిటీ, అల్సర్‌ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా తిన్న పదార్థాలు సైతం త్వరగా జీర్ణం అవుతాయని వివరిస్తున్నారు.

New Update
Health Tips: తినడానికి ముందు నీరు తాగితే అనేక లాభాలు!

Health Tips: నీరు మన శరీరానికి ఎంతో ముఖ్యం. నీరు తాగడం వలన అనేక రోగాలు నయమవుతాయని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే చాలామంది అన్నం తినేటప్పుడు నీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నీటిని ఏ విధంగా తాగాలో చాలామందికి తెలియదు. మరి నీరు ఎలా తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయో.. ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

publive-image

మనం ఏదైనా తినటానికి ముందే నీళ్లను బాగా తాగేసి తర్వాత తినటం మంచిదట. దీనివల్ల అనేక లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మొట్టమొదట లాభమేంటంటే తినటానికి ముందు నీళ్లు తాగేసినందు వల్ల ఖాళీ కడుపు మీద నీరు ఉంటుంది. కాబట్టి నీళ్లు వెంటనే రక్తంలోకి వెళ్తాయి. రక్తంలోకెళ్ళి వాటర్ రిజర్వు అంతా చక్కగా పెంచేసేసి పొట్ట, ప్రేగుల అంచులు కూడా జిగురు పొరలకు నీటి శాతం బాగా పుష్కలంగా లభిస్తుంది.

publive-image

కాబట్టి పొట్ట, ప్రేగుల అంచుల్లో జిగురు బాగా ఊరి ఎసిడిటీ, మంట, అల్సర్‌ వంటివి రాకుండా రక్షించిస్తుంది. ముందు తాగిన నీళ్లు మన రక్తంలో, కణాల్లో బాగా ఉండి శరీరానికి మంచి కూలింగ్ ఇస్తుంది. అంతేకాకుండా ఎండ, వాతావరణ పరిస్థితి నుంచి కాపాడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కావున భోజనం చేయడానికి ముందే నీళ్లు తాగి తర్వాతే తినాలి. బ్రేక్ ఫాస్ట్ చెయ్యకముందే నీరు తాగి.. తర్వాతే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. సాయంత్రం నీరు బాగా తాగిన తర్వాతే డిన్నర్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: జ్యూస్ ఫాస్టింగ్‌తో ఆ సమస్యలన్నీ పరార్!

Advertisment
తాజా కథనాలు