Soaked Raisins Water: కిస్మిస్‌లు ఎంతో తియ్యగా ఉంటాయి. ఎక్కువగా వీటిని స్వీట్స్‌లో మరియు కేక్‌లలో వాడుతూ ఉంటారు. కిస్మిస్‌లు వేయడం వల్ల ఆ పదార్థాలకు ఎంతో రుచి వస్తుంది. కేవలం రుచిలోనే కాదు వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కిస్మిస్‌లలో అధికంగా పోషకాలు ఉంటాయి. గుప్పెడు కిస్మిస్‌లను ఒక రాత్రి మొత్తం నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం ఆ నీటిని పరగడుపునే సేవించాలి. ఇలా ఒక నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కిస్మిస్ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: తొందరపడి జ్ఞానదంతం తొలగించుకోవద్దు..వైద్యులు ఏమంటున్నారంటే
కిస్మిస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది. కిస్మిస్‌లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. నెల రోజుల పాటు ఈ నీటిని తాగితే మన శరీరంలో రక్తం పెరుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. కిస్మిస్‌లలో ఉండే పొటాషియం మనలో రక్త సరఫరాను పెంచుతుంది. దీని ద్వారా హైబీపీ తగ్గిపోతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కిస్మిస్‌లు తినాల్సిందే. హార్ట్ ఎటాక్‌లు కూడా దరిచేరవని నిపుణులు అంటున్నారు.
కిస్మిస్ నీళ్లు తాగితే జీవక్రియలు, గ్యాస్ సమస్య తగ్గుతాయి
కిస్మిస్ నీళ్లను తాగడం వల్ల మనకు ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నీరసం, అలసట వంటివి దరిచేరవు. జ్వరం ఉన్నవారికి కూడా మంచి మందులా పనిచేస్తుంది. రోజూ వ్యాయామం చేసేవారు, ఎక్కువ పనిచేసేవారు కిస్మిస్ నీళ్లను తాగితే శక్తి లభిస్తుంది. చిన్నారుల్లో మెదడు కూడా బాగా పనిచేస్తుంది, తెలివితేటలు బాగా పెరిగి చదువుల్లో కూడా రాణిస్తారని నిపుణులు అంటున్నారు. కిస్మిస్ నీళ్లు తాగడం వల్ల జీవక్రియలు కూడా మెరుగుపడతాయి, గ్యాస్ సమస్య పోతుంది. ఈ నీళ్లను నెలరోజులు తాగడం వల్ల మన చర్మం మెరిసిపోతుంది, అంతేకాకుండా మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.