Munagaku Tea: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగండి!

ఉదయాన్నే మునగాకులతో చేసిన టీ పరిగడుపుతో తాగితే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఈ టీ కడుపు ఉబ్బరం, మలబద్దకం, జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. మునగాకులో ఉండే అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి చాలా శక్తినిస్తాయి.

New Update
Munagaku Tea: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగండి!

Health Tips: ఉదయం నిద్రలేవగానే కొందరికి కాఫీ, టీ, గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వీటన్నింటిలో కెఫిన్ ఉంటుంది. ఇది ఉత్సాహనిచ్చేలా అనిపించినప్పటికీ దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అయితే మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధగుణాలున్నాయి. ఈ ఆకులకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు ఈ మునగాకుతో టీ కూడా చేసుకోవచ్చు. తాజా ఆకులతో కాచిన టీ తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మునగాకు 'టీ'ని డీటాక్స్ డ్రింక్, మిరాకిల్ టీ గానూ భావించవచ్చు. ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో కొన్ని తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం:

  • ఒక గ్లాసు మునగాకు రసం తాగడం వల్ల పేగుల్లో కదలికలు క్రమబద్దీకరిస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్దకం, జీర్ణసంబంధ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

అధిక బరువుకు చెక్:

  • బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో మునగాకు రసాన్ని చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పరగడుపున ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే జీర్ణక్రియలో వేగం పెరుగుతుంది. ఫలితంగా బరువు వేగంగా తగ్గుతారు.

చర్మ ఆరోగ్యానికి:

  • మునగాకు టీ చర్మ సమస్యలు దూరం చేస్తుంది. ఈ మునగాకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ తగ్గి కాంతివంతంగా కనిపిస్తుంది.

మార్నింగ్ బూస్టర్:

  • ఉదయం అలసటగా ఉంటే మునగాకు టీ తాగాలి. మునగాకులో ఉండే అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి చాలా శక్తినిస్తాయి. మనలో ఉత్తేజాన్ని నింపుతాయి.

మధుమేహం:

  • మునగాకుల టీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మధుమేహం వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలను కూడా నివారిస్తుంది. షుగర్ ఉన్నవారు మునగాకులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఐరన్:

  • మునగాకుల్లో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత ఏర్పడదు. రక్తహీనతతో బాధపడే వారికి మునగాకు టీ చాలా ఉత్తమమైనది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారితే ఏం జరుగుతుంది?

Advertisment
తాజా కథనాలు