Milk-Buttermilk Benefits: పాలు, మజ్జిగ కలిపి ఎప్పుడైనా తాగారా?..ఏం జరుగుతుందో తెలుసా..?

మజ్జిగలో ఎన్నో రకాలు పోషకాలు ఉన్నాయి. రోజూ మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలు-పుల్లని మజ్జిగ- పొడి కలిపి తాగితే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

New Update
Milk-Buttermilk Benefits: పాలు, మజ్జిగ కలిపి ఎప్పుడైనా తాగారా?..ఏం జరుగుతుందో తెలుసా..?

Milk-Buttermilk Benefits: మజ్జిగలో ఎన్నో రకాలు పోషకాలు ఉన్నాయని తెలుసు. వేసవిలో ఎక్కువగా గుర్తుకు వచ్చేది బటర్‌ మిల్క్‌. రోజూ మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బటర్‌ మిల్క్‌ మంచి ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేదం నిపుణులు అంటున్నారు. ఈ మ‌జ్జిగను ఎక్కువగా లంచ్ అయ్యాక కచ్చితంగా ఒక గ్లాస్ మ‌జ్జిగ తాగుతారు. శ‌రీరానికి చ‌లువ చేసే ప‌దార్థాల్లో మ‌జ్జిగ‌క ఒక‌టి. జీర్ణ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డేవారు మజ్జిగ తాగితే జీర్ణ వ్యవ‌స్థ, పేగుల‌ను ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక చర్మరోగాలు, కొవ్వు, దీర్ఘకాలిక వ్యాధులు, వేడి తగ్గితుందని పెద్దలు చెబుతారు. ఈ బటర్‌ మిల్క్‌ను తాగితే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యంగానికి ఎన్నో ప్రయోజనాలు

  • మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, అధిక దాహం, వడ దెబ్బ తగలకుండా ఉంటుంది.
  • మజ్జిగలో జీలకర్ర, అవిసెగింజలు, ధనియాలు, సైంధవ లవణం పొడి కలుపుకుని తాగితే మంచిది.
  • ఈ మజ్జిగని లంచ్‌, మధ్యాహ్నం 3–4 గంటలకు తాగితే సులువుగా బరువు తగ్గుతారు.

పాలు-పుల్లని మజ్జిగ- పొడి కలిపి తాగితే...

  • వీటిల్లో ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ పోడి చేసి అందులో తగినంత ఉప్పు కలిపి ఓ సీసాలో భద్రపరచుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఓ గ్లాసు పాలులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలిపి పైన చెప్పుకున్న పోడిని కలిపి తాగితే.. వడదెబ్బ కొట్టదు. అంతేకాకుండా పేగులకు బలాన్ని, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఈ డ్రింక్‌ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు వేసవిలో కలిగే జలుబుని ఈ డ్రింక్‌ నివారిస్తుంది. అయితే.. ఈ మజ్జిగని ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉంటే మంచిది. ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు పెట్టడం వల్ల మేలు చేసే బాక్టీరియా తగ్గుతుంది. కాగా.. ప్యాక్‌ చేసిన మజ్జిగ బదులు అప్పటికప్పుడు తయారు చేసుకున్న మజ్జిగ తాగితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కువగా బయటకు వెళ్తున్నవారు ఈ మజ్జిగను ప్యాక్‌ చేసుకోవాని తీసుకెళ్తే మంచిది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. బీరకాయ.. నేతి బీరకాయతో అద్భుత లాభాలు

Advertisment
తాజా కథనాలు