Garlic Water: వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఉపయోగాలు.. ఎన్ని గ్లాసులు తాగాలి?

వంటల్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాలంటన్నారు నిపుణులు. కొన్ని వెల్లుల్లి రెబ్బల‌ను బాగా దంచి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి మ‌రిగించాలి. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తరువాత ఆ నీటిని టీలాగా తాగాలి. ఇలా తాగితే శ‌రీరంలో రోగ నిరోధక శ‌క్తి అధికంగా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు

New Update
Garlic Water: వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఉపయోగాలు.. ఎన్ని గ్లాసులు తాగాలి?

Garlic Water: వెల్లుల్లి అంటే భారతీయుల్లో తెలియని వాళ్ళు ఉండరు. పూర్వకాలం నుంచే వెల్లుల్లి వంటకాల్లో వాడుతూ వస్తున్నారు. ప్రతిరోజు చేసే వంటల్లో వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. వెల్లుల్లి లేకపోతే ఆ కూరకు రుచి రాదు. దీంతో పచ్చడి కూడా చేసుకుంటారు. నాన్ వెజ్ వంటకాల్లో అయితే వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. ఈ వెల్లుల్లి కూరలు, పచ్చళ్లే కాకుండా.. వెల్లుల్లి నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి నీరుతో వైర‌ల్ ల‌క్షణాలు ఇన్‌ఫెక్షన్లు త‌గ్గుతాయి
వెల్లుల్లి నీటిని తయారు చేసుకోవాటానికి ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బల‌ను తీసుకుని బాగా దంచుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి మ‌రిగించాలి. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చగా ఉండ‌గానే ఒక క‌ప్పుని టీలాగా తాగాలి. ఇలా రోజూ తాగితే శ‌రీరంలో రోగ నిరోధక శ‌క్తి అధికంగా పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ ల‌క్షణాలు ఇన్‌ఫెక్షన్లు ఉంటే త‌గ్గుతాయి. అంతేకాకుండా శ్వాస కోశ స‌మ‌స్యలు, ద‌గ్గు, జ‌లుబు, అధిక బ‌రువు, శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ , కొవ్వు, షుగ‌ర్ లెవ‌ల్స్ వంటి సమస్యలకు వెల్లుల్లి నీటిరు ఎంతో ప్రయోజ‌నంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: కివీ పండు పొట్టు సులభంగా వలిచే చిట్కాలు..మీరూ ట్రై చేయండి

అలాగే.. వెల్లుల్లి నీటిని తాగితే మూత్రాశ‌య ఇన్ఫెక్షన్లు త‌గ్గి మూత్రం స‌రిగ్గా వ‌స్తుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది, శ‌రీరంలో వాపులు, నొప్పులు త‌గ్గేందుకు ఈ నీరు బెస్ట్‌. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. రోజూ వెల్లుల్లి నీటిని తాగితే శ‌ర‌రీంలో ర‌క్త స‌ర‌ఫ‌ బాగా జరుగుతుంది. దీంతో హైబీపీ త‌గ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు సమస్య రాకుండా ఉంటుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం సమస్యలు ఉంటే రోజూ వెల్లుల్లి నీటిని తాగ‌డం వ‌ల్ల ప్రయోజ‌నం క‌లుగుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు