బిర్యాని తిన్న తర్వాత..కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?అయితే మీ పని అయినట్టే!

బిర్యానీ తింటూ కూల్​డ్రింక్స్ తాగే అలవాటు ఉందా? తిన్న తర్వాత సోడా, కూల్​డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. లేదంటే మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బిర్యాని తిన్న తర్వాత..కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?అయితే మీ పని అయినట్టే!
New Update

ఇటీవల కాలంలో కూల్​డ్రింక్స్ వాడకం విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సీజన్​తో సంబంధం లేకుండా కొందరు వీటిని తెగ తాగేస్తుంటారు. అయితే చాలా మంది ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు కూల్ డ్రింక్స్ సోడా తాగడం చేస్తుంటారు. మరికొందరు తిన్న తర్వాత పొట్టలో ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. నేటి యువత అయితే పిజ్జా, బర్గర్, ఏదైనా స్పైసీ ఫుడ్.. తిన్నప్పుడు కూల్​డ్రింక్స్ తప్పనిసరిగా సేవిస్తుంటారు.

భోజనం తర్వాత కూల్​డ్రింక్స్, సోడా లాంటివి తాగడం వల్ల చాలా మంది కడుపులో కాస్తా రిలాక్స్​గా ఉంటుందని, త్వరగా ఆహారం జీర్ణమవుతుందని ఫీల్ అవుతుంటారు. కానీ, తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తిన్నాక జ్యూస్​లు తాగడం కూడా అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. అలాగే త్రేన్పులు రావడం ద్వారా వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ, ఇది తాత్కాలికం మాత్రమే అనే విషయం మీరు గమనించాలి. నిజానికి తిన్నాక సోడా తాగడం వలన గ్యాస్ పెరుగుతుందని.. దీంతో అనేక సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తుంది. దాంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు కూర్చోడానికి, నిల్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, వెన్నునొప్పి వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఇక కొంతమంది తిన్న తర్వాత జ్యూస్​లు కూడా తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే బరువు కూడా పెరుగుతారు. కాబట్టి భోజనం తర్వాత వీటిని కూడా తాగకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

#tips-for-better-health #cold-drinks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe