Good Health: చామంతి టీ తాగితే చాలా మంచి నిద్ర పడుతుందా..? చామంతి టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్న వారికి ఇది మంచి మెడిసిన్ మాదిరిగా పని చేస్తుందని వివరిస్తున్నారు. ఈ టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. డయాబెటిస్ రోగులు, నెలసరి నొప్పులు ఉన్నవాళ్లు ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 29 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Chamanti Tea: ఉదయం చామంతి టీ తాగడం మంచిదని న్యూట్రిషనిస్ట్ నిపుణులు అంటున్నారు. చామంతిలోని ఫ్లేవనాయిడ్స్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఈ టీ తాగితే హెల్దీగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్లు చామంతి టీ తాగాలని చూచిస్తున్నారు. ఈ టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గఢనిద్ర పట్టేలా చేస్తుంది. ప్రతిరోజూ చామంతి టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. చామంతి టీ తాగితే కలిగే ప్రయోజనాలు: ఈ సీజన్లో రోజూ వేడివేడి చామంతి టీ తాగటం వలన మనసు తేలికవుతుంది. అంతేకాకుండా మూడ్ స్వింగ్స్ ఉంటే ఈ టీ మూడ్ మారుతుంది. చలికాంలో జలుబు సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది. చామంతి టీ ఆవిరి పట్టినా ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. నెలసరి నొప్పులు తగ్గాలంటే చామంతి టీ మంచిది. ఈ టీలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బ్లడ్షుగర్ని తగ్గిస్తాయి. చామంతి టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. డయాబెటిస్ రోగులు ఈ టీ తాగిన మంచి ఫలితం ఉంటుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #chamanti-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి