Sleeping Tips: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి! ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి ఏలకుల నీరు ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఔషధంలా పనిచేస్తుంది. By Vijaya Nimma 23 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Good Sleep: ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని కురల్లో చేర్చుకుంటే మంచి రుచిని ఇస్తాయి. ఏలకులను టీలో వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం బయట అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాము. ఇవి జీర్ణం కాక ఎసిడిటీ, అజీర్తి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివల్ల మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏలకుల నీరు తాగితే బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో అందరు బరువు సమస్య ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్లకు ఏలకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఒక గ్లాస్ గోరువెచ్చ వాటర్‌లో ఏలకులు వేసి మరిగించాలి. ఈ నీటిని తాగితే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఈ మధ్యకాలంలో నిద్ర పట్టక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కూడా ఏలకుల నీటిని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాక శరీరంలో రక్తప్రసవం సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఏలకులు ఔషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: గోళ్లు ఆరోగ్యంగా.. అందంగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా? #good-sleep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి