Cardamom Benefits: ఇప్పుడు తినే ఆహారాల వల్ల కొవ్వు అధికంగా పెరుగుతుంది. దీనిని తగ్గించుకోవాటానికి అనేక ప్రయత్నాలు చూస్తూ ఉంటారు. మొత్తం శరీరం కంటే బొడ్డు కొవ్వును తగ్గించడం చాలా కష్టంగా ఉంటుంది. జిమ్‌తో పాటు కొన్ని సహజ మార్గాల్లో కూడా బొడ్డు కొవ్వును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందు కోసం ఏలకులు మీకు సహాయపడతాయి. కొవ్వుపై మీరు దృష్టి పెడితే అది సులభంగా తగ్గుతుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఈరోజు ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇంటి నివారణల ద్వారా బొడ్డు కొవ్వును తగ్గించవచ్చు:
- బొడ్డు కొవ్వును తగ్గించడానికి అది స్థిరత్వం కలిగి ఉండాలి. ఏలకుల టీ తాగడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో మీకు చాలా మేలు చేస్తుంది.
- మీరు కొవ్వు తగ్గాలనుకుంటే పాలతో టీ తాగాలి. దీంతో బొడ్డు కొవ్వు క్రమంగా తగ్గుతుంది.
- ఏలకుల టీ తయారుచేసినప్పుడల్లా దానిని 5 నిమిషాలు ఉడికించి ఫిల్టర్ చేయాలి. ఇలా రోజూ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఏలకులు లెమన్ టీలో కూడా ఉపయోగించవచ్చు. ఏలకులను నీటిలో వేసి మరిగించి నిమ్మరసం వేసి తాగాలి. ఇలా ప్రతీరోజూ తాగితే బొడ్డు చుట్టు ఉన్న కొవ్వుతోపాటు శరీరంలోని కొవ్వు కూడా కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.