Health Tips: ప్రతిరోజూ బీర్ తాగుతున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తే షాక్ అవుతారు..!!

కొంతమందికి రోజూ బీర్ తాగే అలవాటు ఉంటుంది. బీర్ ఎక్కువగా తాగుతే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

New Update
Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

కొందరు రోజూ తాగుతే..ఇంకొందరు వారానికోసారి మద్యం తాగుతుంటారు. ఇంకొందరు పండగలలో మాత్రమే తాగుతుంటారు. కానీ కొందరు మాత్రం ప్రతిరోజూ తాగుతుంటారు. అలాంటి వారికి ఇది హెచ్చరించే వార్తే. మీరు ప్రతిరోజూ బీర్ తాగుతే..శరీరంలో ఏం జరుగుతుంది...ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుంటే షాక్ అవుతారు.

మద్యం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. మద్యపానం శారీరక సమస్యలను కలిగించడంతోపాటు బరువు పెరుగుతుంది. ఈ అవగాహన చాలా వరకు నిజం. ఎందుకంటే బీర్ ఎక్కువగా తాగుతే బెల్లీ ఫ్యాట్ గణనీయంగా పెరుగుతుంది. బీర్ ఎక్కువగా తాగడం వల్ల పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోయి కొవ్వులో తీవ్రమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. బీర్ వల్ల బరువు పెరగడంతోపాటు బీర్ బెల్లీ సమస్య ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏదైనా ఆల్కహాలిక్ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే మీ శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఇది పొట్ట కొవ్వును పెంచమే కాకుండా ఇతర ఆల్కహాలిక్ పానీయాలలో కంటే బీర్ కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. బీర్ ఎక్కువగా తీసుకుంటే పొట్ట కొవ్వు పెరుగుతుంది. పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వులు చాలా జిగటగా మారి...వాటిని విసెరల్ ఫ్యాట్స్ గా పిలుస్తారు. ఈ కొవ్వులు శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఈ కొవ్వులు మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. సాధారణంగా బీర్ తాగడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే జొన్నలు, గోధుమలను పులియబెట్టి బీరు తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే కేలరీలు అంత ఎక్కువుంటాయి. ఒక గ్రాము ఆల్కాహాల్ లో ఏడు కేలరీలు ఉంటాయి.

సాధారణంగా బీరులో నాలుగు నుంచి ఆరు శాతం ఆల్కాహల్ ఉంటుంది. ఒక సాధారణ బీర్ లో 153 కేలరీలు, 14 గ్రాముల ఆల్కహాల్, 13 గ్రాముల కార్బొహైడ్రేట్లు,2 గ్రాముల ప్రొటీన్, జీరో కొవ్వులు ఉంటాయి. అయితే బీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ముప్పు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 5వందల ఎంఎల్ కంటే తక్కువ బీర్ తాగే వ్యక్తుల పొట్టలో కొవ్వు పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది. మూడు కంటే ఎక్కువ డ్రింక్స్ తాగేవారిలో బెల్లీ ఫ్యాట్ వచ్చే ప్రమాదం 80శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా బీర్ తాగుతుంటారు. వారి బరువు వేగంగా పెరుగుతుంది. ఆల్కహాల్ పురుషుల్లో సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు బెల్లీ ఫ్యాట్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి:  అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్…ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మృతి ..!!

Advertisment
తాజా కథనాలు