Ash Gourds Juice : బూడిద గుమ్మడి జ్యూస్ తో అనేక హెల్త్ బెనిఫిట్స్.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

బూడిద గుమ్మడి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు సమస్యలను తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్-సీ రోగనిరోధకశక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. డయాబెటిస్ మెడిసిన్ వాడే వారు ఈ జ్యూస్ తాగడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Ash Gourds Juice : బూడిద గుమ్మడి జ్యూస్ తో అనేక హెల్త్ బెనిఫిట్స్.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

Ash Gourds Juice: బూడిద గుమ్మడిని ఇంటికి దిష్టి తగలకుండా కడతారు. వివిధ వంటలకు కూడా ఉపయోగిస్తారు. ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కాయ జ్యూస్‌ తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్​ తాగితే చాలా మంచిదని సూచిస్తున్నారు. ఆయుర్వేదంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ బెనిఫిట్స్‌ను కూడా ప్రస్తావించారు. వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్‌ ఖచ్చితంగా తాగలని నిపుణులు చెబుతున్నారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుపుతున్నారు. బూడిద గుమ్మడి కాయ రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? నష్టాలు కూడా ఉన్నాయా? అసలు దీనిని తాగవచ్చా? లేదా? అనే దానిపై ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Ash Gourds juice ప్రతీకాత్మక చిత్రం

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ తాగితే కలిగే ప్రయోజనాలు:

  • బూడిద గుమ్మడి న్యూట్రిషనల్ వాల్యూస్‌​తో నిండి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రోలైట్స్ మిమ్మల్ని హైడ్రేటెడ్‌​గా ఉంచుతాయి. డ్రై స్కిన్ వంటి సమస్యలున్నవారు దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు.
  • కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలున్న వారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.
  • దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కణాలను రిపేర్ చేస్తాయి. క్రోనికల్ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. దీనిలోని విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది.
  • బూడిద గుమ్మడిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు నొప్పి, వాపును దూరం చేసి జుట్టుకు, స్కిన్‌​కు మంచి ప్రయోజనాలు అందిస్తాయి.
  • బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
  • కొందరిలో బూడిద గుమ్మడి అలెర్జీ, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ ప్రయోజనాలు కావాలని ఎక్కువ తాగితే.. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
  • షుగర్ ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ మెడిసిన్ వాడే వారు, రక్తం చిక్కగా ఉన్నవారు బూడిద గుమ్మడి జ్యూస్ తాగవద్దని ఆరోగ్య చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ వస్తువులతో ఫ్లైట్‌లోకి నో ఎంట్రీ.. కారణం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు