Apple Tea: యాపిల్‌ టీ తాగండి.. ఆ సమస్య దూరం అవ్వకపోతే అడగండి!

రోజూకు రెండు సార్లు యాపిల్ టీ తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్, బరువు లాంటి సమస్యలను నివారిస్తుంది. యాపిల్ టీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. దీనిలో తేనెలో వేసి తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

New Update
Apple Tea: యాపిల్‌ టీ తాగండి.. ఆ సమస్య దూరం అవ్వకపోతే అడగండి!

Weight Loss Tips:యాపిల్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిదని విషయం తెలిసిందే. ఆపిల్ టీ గురించి ఎప్పుడైనా విన్నరా..? ఈ టీ తాగడం వల్ల మన జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. ఎందుకంటే యాపిల్ తినటం వలన ఎలాంటి రోగాలు దరి చేరవు అంటారు. అయితే.. యాపిల్‌తో చేసిన టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు అనే విషయం తెలుసా..? ఎలాగో చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అజీర్తి వంటి సమస్యలు దూరం

అధిక బరువు ఉన్నవారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఏం చేసిన బరువు తగ్గటం కష్టంగా ఉంటుంది అందుకని యాపిల్‌తో చేసిన టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. యాపిల్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగనాలున్నాయి. లూజ్ మోషన్‌తో బాధపడుతుంటే యాపిల్ టీ మీకు దివ్యౌషధం అని నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు సమస్యలతో పాటు అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. యాపిల్ టీని డిటాక్స్ డ్రింక్‌గా ఉపయోగించవచ్చు. ఈ టీ తాగడం వల్ల శరీరంలోని అన్ని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. యాపిల్ టీ సహజ చక్కెరలను కలిగి ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి.. రక్తంలో చక్కెర స్థాయిని పెంచదుకు యాపిల్ టీ బెస్ట్ అని చెబుతున్నారు.

కావలసిన పదార్థాలు:

  • 1-2 యాపిల్స్‌ ముక్కలు
  • నీరు
  • చక్కెర
  • దాల్చిన చెక్కపొడి
  • టీ బ్యాగ్‌

యాపిల్ టీ తయారీ విధానం:

  • రెండు కప్పుల నీటిని తీసుకుని ఒక పాత్రలో వేసి చిన్న మంట మీద వేడి చేయాలి. తర్వాత అందులో టీ బ్యాగ్, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు నీటిని మరిగేటప్పుడు, కొన్ని యాపిల్ ముక్కలను పాత్రలో వేయాలి. ఇప్పుడు దాల్చిన చెక్క పొడిని అందులో వేసి రెండు 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తరువాత దీన్ని వడకట్టి గొరువెచ్చగా యాపిల్ టీ తాగితే రుచి అదిరిపోతుంది. రెగ్యులర్‌గా యాపిల్ టీ తాగితే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. రోజూ యాపిల్‌ టీ తాగడం వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ యాపిల్ టీని రోజూకు రెండుసార్లు తాగితే ఎంతో మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈటీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. అంతేకాదు దీనిలో తేనెలో వేసి తాగితే రోగనిరోధక శక్తి ఆధికంగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఈ చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణం కావచ్చు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు