Health Tips : చలికాలంలో ఉదయం 7గంటల లోపు ఈ నీళ్లను 15రోజులు తాగండి..ఫలితాలు మీరే చూస్తారు.!!

నేటికాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి కారణాలెన్నో ఉండవచ్చు. అయితే ప్రతిరోజూ ఉదయం 7గంటలలోపు మెంతులు, సోంపుతో తయారు చేసిన నీళ్లు 15రోజులు తాగితే బొడ్డు చుట్టున్న కొవ్వు కరిగిపోతుంది. సులభంగా బరువు తగ్గుతారు.

New Update
Health Tips : చలికాలంలో ఉదయం 7గంటల లోపు ఈ నీళ్లను 15రోజులు తాగండి..ఫలితాలు మీరే చూస్తారు.!!

చాలామంది అధికబరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అధిక బరువు బారిన పడుతున్నారు. బరువు పెరగడం, పొట్ట కుంగిపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరకంగా దృఢంగా ఉన్నా..బరువు మాత్రం తగ్గరు. ఆహారాన్ని మార్చినా పెద్దగా సహాయపడదు. కొంతమంది మంది కొవ్వు కరిగించేందుకు ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. వేలాడే పొట్ట కొవ్వు మీ వ్యక్తిత్వాన్ని కూడా పాడు చేస్తుంది. కానీ మీరు ప్రతిరోజూ ఉదయం 7గంటలలోపు ఈ నీటిని తాగినట్లయితే బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. మెంతులు, సోంపు నీరు....ఈ రెండింటితో తయారు చేసిన నీరు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దాని గొప్ప ప్రయోజనాలేంటో చూద్దాం.

డిటాక్సర్:
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సోంపు,మెంతినీరు తాగుతే శరీరం బాగా డిటాక్సిఫై అవుతుంది. శరీరంలోని అన్ని రకాల వ్యర్థాలు క్రమంగా తొలగిపోతాయి. అంతేకాదు ఈ నీటిని 15రోజులకు మంచి నిరంతరం తాగకుండా జాగ్రత్తపడండి.

రోగనిరోధకశక్తి బూస్టర్:
మెంతులు, సోంపు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మంచి రోగనిరోధకశక్తి బూస్టర్ గా పనిచేస్తుంది. మెంతినీరు తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

జీర్ణవ్యవస్థ:
మెంతి, సోంపునీరు జీర్ణవ్యవస్థకు దివ్యౌషధం లాంటిది. ఇది కడుపును శుభ్రంగా ఉంచడంతోపాటు జీర్ణక్రియ ప్రక్రియను సులభం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

బరువు తగ్గడంలో:
క్రమం తప్పకుండా మెంతులు, సోంపు నీటిని తాగుతే బరువు తగ్గవచ్చు. ఇది బరువు తగ్గే ప్రక్రియను సులభం చేస్తుంది. మంచి ఫలితాల కోసం మీరు దాని గింజలను కూడా నమిలి తినవచ్చు.

సోంపు, మెంతిగింజల నీరు తయారీ విధానం:

- 1 టీస్పూన్ మెంతిగింజలు, 1 టీ స్పూన్ సోంపు, 1 కప్పునీటిలో రాత్రంతా నానబెట్టాలి.

-ఉదయం వడకట్టి ఆ నీటిని తాగాలి.

-ఈ నీరు చేదుగా అనిపిస్తే అందులో తేనే కూడా కలపుకోవచ్చు.

-ఈ నీరు తాగిన తర్వాత మీరు నానబెట్టిన గింజలను కూడా తినవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది కూడా చదవండి: రేవంత్ ప్రేమ ‘గీతం’..🥰😘 వాళ్లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్

Advertisment
Advertisment
తాజా కథనాలు