Celery Tea: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా.? ఒక్కసారి తాగితే సీజన్ సమస్యలు పరార్

సెలెరీటీ ఒక హెల్బర్‌ టీ. దీనిని తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటంతోపాటు బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఈ టీ వల్ల రక్తం శుద్ధి అవడంతో పాటు జీర్ణక్రియలో ఇబ్బందులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Celery Tea: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా.? ఒక్కసారి తాగితే సీజన్ సమస్యలు పరార్

Celery Tea: నేటి కాలంలో టీ తాగే అలవాటు చాలామందికి ఉంది. కొందరైతే రోజుకి రెండు మూడు సార్లు తాగుతారు. దానిని తాగితే ఎంతో ఎనర్జీ, ఉత్సాహం వస్తుందని చాలామంది ఫీల్ అవుతారు. అంతేకాదు తలనొప్పి కూడా తగ్గుతుందని అంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నోసార్లు టీ తాగుతారు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పినా వినకుండా అలాగే తాగుతూ ఉంటారు. అయితే మరికొందరైతే ఆరోగ్యం మంచిగా ఉండాలని హెర్బల్ టీని ఇష్టపడతారు. ఈ హెర్బల్‌టీ అనేక సమస్యలకు దివ్వౌషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వలన వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, అనారోగ్య బారిన పడకుండా కాపాడుతుంది. సెలెరీటీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం.

సెలెరీటీ జీర్ణ, ఆరోగ్యానికి మంచిది:

  • సెలెరీటీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా ఈ టీలో థూమోల్‌ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు, గ్యాస్, మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిని రోజు తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

బరువు కంట్రోల్‌:

  • ఈమధ్య కాలంలో బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివారు సెలేరీ టీ తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై త్వరగా బరువును తగ్గిస్తుంది. ఈ టీ శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించి.. బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది.

జలుబు, దగ్గుకు చెక్‌:

  • వర్షాకాలంలో అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల అలాంటి సమస్యలు తగ్గడంతో పాటు గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఈ టీలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వలన జలుబుని పెరగనివ్వకుండా కాపాడుతుంది.

గుండెకు మంచిది:

  • ఈ మధ్య గుండె సమస్యలు వస్తున్న విషయం తరచుగా చూస్తూనే ఉన్నాం. అలాంటివారు కొద్దిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. ఈ సమస్యకు హెర్బల్‌టీ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచి సంబంధిత సమస్యల ప్రమాదం రాకుండా చేస్తుంది.

రక్తం శుద్ధి అవుతుంది:

  • శరీరానికి రక్తం కీలకమైనది. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము. అయితే సెలెరీ టీ తాగితే రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించి.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

సెలెరీటీ దూరంగా ఎవరు ఉండాలి:

  •  సెలెరీటిలో ఎక్కువ వేడి స్వభావం ఉంటుంది. అయితే దీనిని గర్భిణీలు, బాలింతలు, పెప్టిక్ అల్సర్, హైపర్ అసిడిటీ సమస్య ఉన్నవారు ఈ టీకి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చేపకు బదులుగా పామును తిన్న చిన్నారులు.. చివరికి ఏమైందంటే?

Advertisment
తాజా కథనాలు