గంభీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్! టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, నూతన కోచ్ గంభీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. శ్రీలంక టీ20 సిరీస్ మ్యాచ్ కు ముందు గంభీర్ కు ఓ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. దీనిని ప్రత్యేకంగా వీక్షించిన గంభీర్,ద్రవిడ్ మాటలకు భావోద్వేగానికి లోనైయాడు.ఈ వీడియోను BCCI ఇంటర్నెట్ లో పంచుకుంది. By Durga Rao 28 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమ్ ఇండియా శ్రీలంకతో తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు ముందు గంభీర్‌కు ప్రత్యేక వ్యక్తి నుంచి సర్‌ప్రైజ్ మెసేజ్ వచ్చింది. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓ వాయిస్ మెసేజ్ ద్వారా గంభీర్ కు శుభాకాంక్షులు తెలిపారు.అది విన్న గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాలలో పంచుకుంది. ‘‘హలో గంభీర్ టీమిండియా నూతన కోచ్‌గా ప్రపంచంలోనే అత్యంత ఆహ్లాదభరితమమైన పనిలోకి నిన్ను స్వాగతిస్తున్నా. టీమ్ ఇండియాతో నా ప్రయాణం ముగిసి దాదాపు మూడు వారాలవుతోంది.బార్బడోస్‌లో టీ20 వరల్డ్ విజయంతో నా పదవికాలాన్ని ముగించాను. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఘన స్వాగత కార్యక్రమం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ముఖ్యంగా జట్టుతో నా స్నేహాన్నీ, జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని ద్రవిడ్ అన్నారు. ఇప్పుడు కొత్త కోచ్‌గా నువ్వు బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుత సమయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా’’ అని ద్రవిడ్ ఆకాంక్షించాడు.‘‘ప్రతి గ్రూప్‌లోనూ ఫిట్‌గా ఉండే ఆటగాళ్లు నీకు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను. దీంతో పాటు అదృష్టం ఎల్లప్పుడూ నీవైపు ఉండాలని కోరుకుంటున్నా.నువ్వు ఆటగాడిగా మైదానంలో ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చావో నేను చూశాను ఐపీఎల్ సీజన్లలో నీ కోచింగ్‌తో.. గెలవాలనే నీ కసిని, యువ ఆటగాళ్లతో కలిసి పని చేసే విధానాన్ని, మైదానంలో నీ జట్ట నుంచి ఉత్తమ ప్రదర్శనను బయటకు తీసే సామర్థ్యాన్ని గుర్తించా. మనపై అంచనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో నీకు అందరి నుంచి మద్ధతు దొరుకుతుందిని ద్రవిడ్ అన్నారు.‘ఇది నీకు కష్టమైనా సరే.. అప్పుడప్పుడు చిరునవ్వుతో కన్పించు’ అంటూ తన వ్యాఖ్యలను ముగించాడు. 𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝 To, Gautam Gambhir ✉ From, Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0 — BCCI (@BCCI) July 27, 2024 ద్రవిడ్ మేసేజే విన్న గంభీర్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. జట్టు కోసం ఏదైనా చేసే వ్యక్తి ద్రవిడ్.. అతని నుంచి తనతో పాటు భవిష్యత్తు తరాలు ఎంతో నేర్చుకోవచ్చని అన్నాడు. తనపై ఉంచిన పెద్ద బాధ్యతను నిజాయతీగా నిర్వర్తిస్తానని, ద్రవిడ్ గర్వపడేలా పదవిని చేపడతానని వెల్లడించారు. #gambhir #dravid మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి