Rahul Dravid: టీ20 వరల్డ్ కప్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన ద్రవిడ్!

కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ పై చేసిన ఆసక్తి కర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.కప్ వారి కోసం వీరి కోసమో గెలవాలి అని చెప్పటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.ఫైనల్ లో మా జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్‌ ఆడాలని మాత్రమే నేను కోరుకుంటా అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.

Rahul Dravid: టీ20 వరల్డ్ కప్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన ద్రవిడ్!
New Update

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు రెండోసారి చేరుకున్న భారత జట్టు (India) వరల్డ్‌ కప్‌ ను ఎలానైనా సాధించాలని పట్టుదలగా ఉంది. అందులో భాగంగా శనివారం నాడు జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో (South Africa) తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. మరోపక్క టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి (Rahul Dravid) ఇదే చివరి మెగా టోర్నీ. ఈ నెల తర్వాత ఆయన కోచింగ్‌ బాధ్యతలను వేరొకరికి అప్పగించనున్నారు. .

ఈ నేపథ్యంలో కోచ్‌ ద్రవిడ్‌ కోసమైనా ఈసారి కప్‌ నెగ్గాలనే కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. దీనిపై ద్రవిడ్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా మీరు ‘ఎవరెస్టును ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నావు?’ అని అడిగితే.. అతడు ‘అక్కడ అది ఉంది కాబట్టే నేను ఎక్కుదామనుకున్నాను’ అని చెబుతారు. అదే ప్రశ్నను ఆటగాళ్లను అడిగితే ‘వరల్డ్‌ కప్‌ (World Cup) ఇక్కడుంది. అందుకే గెలవాలని భావిస్తున్నా’ అని చెప్పాలి. అంతేకానీ, ఇది కొందరి కోసమో, ఒకరికి అంకితం చేయడానికో కాదని అన్నారు. తమ జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్‌ రావాలని మాత్రమే తాను కోరుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అంతేకానీ, తన కోసం కప్‌ గెలవాలనే దానికి తాను విరుద్ధమన్నారు. అసలు దానిగురించే మాట్లాడాలనుకోనని ద్రవిడ్‌ వెల్లడించారు.

విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఆటతీరుపై వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై ద్రవిడ్‌ స్పందించాడు. అత్యుత్తమ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ఫలితాలు సానుకూలంగా రావని చెప్పారు. అలాంటి సమయంలో అతడు విఫలమైనట్టు భావించనక్కర్లేదని తెలిపారు. కోహ్లీ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సిక్స్‌ కొట్టాడని, అదే దూకుడు ప్రదర్శించే క్రమంలో ఔటయ్యాడని చెప్పారు. అతడి ఆటతీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. కోహ్లీ యాటిట్యూడ్‌ సూపర్‌ అని, తప్పకుండా మున్ముందు అతడి బ్యాట్‌ నుంచి పరుగులు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: టీమిండియా..సౌతాఫ్రికా ఫైనల్స్.. మోత మోగిస్తున్నమీమ్స్.. మీరూ చూసేయండి!

#cricket-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe