Team India Coach: ద్రవిడ్ వెళ్ళిపోతున్నాడు.. తరువాతి కోచ్ అతనేనా?

టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు. 

Team India Coach: ద్రవిడ్ వెళ్ళిపోతున్నాడు.. తరువాతి కోచ్ అతనేనా?
New Update

Team India Coach: వరల్డ్ కప్ ముగిసింది . దీంతో పాటు టీమిండియా ప్రధాన కోచ్ ద్రవిడ్ పదవీకాలం కూడా పూర్తయింది. రెండేళ్ల పాటు ఈ పదవీకాలం ఉంటుంది. రాహుల్ ద్రవిడ్ నవంబర్ 2021లో టీమ్ ఇండియా చీఫ్ కోచ్‌గా నియమించింది బీసీసీఐ. ద్రవిడ్ కావాలని కోరుకుంటే, తన పదవీకాలాన్ని అవకాశం ఉంది. కానీ, రాహుల్ ఆ ఉద్దేశ్యంలో లేదు. తన పదవీకాలాన్ని పెంచుకోవడం కోసం ఆసక్తి చూపించడం లేదు. 

ఈ విషయాన్ని అతను  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తెలియచేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) బాధ్యతలు చేపట్టాలని ఉందంటూ తన కోరికను మళ్ళీ వెల్లడించాడు ద్రవిడ్. 

అహ్మదాబాద్‌లో నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా(Team India Coach) రాహుల్ ద్రవిడ్‌కి చివరి మ్యాచ్ అని జాతీయ మీడియా చెప్పింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

ప్రధాన కోచ్‌గా VVS లక్ష్మణ్?

 ప్రపంచకప్ తర్వాత, ఆస్ట్రేలియాతో జరిగే 5-మ్యాచ్‌ల T-20 సిరీస్‌కు లక్ష్మణ్ ను టీమ్ ఇండియా కోచ్‌గా నియమించారు.  గతంలో ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో అతను చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా, గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో కూడా అతను ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు.

Also Read: క్రికెట్ అంపైర్ అవ్వడం ఎలా? జీతం తెలుసుకుంటే షాక్‌ అవుతారు!

ప్రపంచకప్ సందర్భంగా అహ్మదాబాద్‌లో బీసీసీఐ అధికారులను లక్ష్మణ్ కలిశారు. డిసెంబరులో జరిగే దక్షిణాఫ్రికా టూర్‌లో అతను టీమ్ ఇండియాతో పాటు రెగ్యులర్ కోచ్‌గా వెళ్లే అవకాశాలున్నాయి. 

ఎరెండేళ్లుగా న్‌సీఏ చీఫ్‌గా..
ద్రవిడ్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించిన తర్వాత గత రెండేళ్లుగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎన్‌సీఏ చీఫ్‌గా కొనసాగుతున్నారు. టీమ్ ఇండియా చీఫ్ కోచ్(Team India Coach) కాకముందు ద్రవిడ్ ఎన్‌సీఏ చీఫ్‌గా ఉన్నారు. ద్రవిడ్ మళ్లీ ఎన్‌సిఎ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాలని తన కోరికను వ్యక్తం చేశాడు.  ఈ విషయాన్ని బిసిసిఐకి కూడా తెలియజేశాడు.

వాస్తవానికి మీడియా సమాచారం తప్ప  ద్రావిడ్ - ఇతర కోచింగ్ సిబ్బంది పదవీకాలం పొడిగిస్తారా?  లేదా అనేది ఇంకా స్పష్టంగా అధికారికంగా తెలియలేదు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు.

Watch this interesting Video:

#dravid #team-india #vvs-lakshman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe