డ్రామారావు మరో డ్రామాకు తెరతీశారు: కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు

టీఎస్-ఐపాస్‌ కింద తెలంగాణప్రభుత్వం తప్పుడు నోటిఫికేషన్‌ ప్రకటిస్తోందని ఎఫ్‌జీజీ (ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌) వివరించింది. ప్రాజెక్ట్‌లకు రాని పెట్టుబడులు వచ్చినట్లు..లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపిస్తున్నారని టీఎస్-ఐపాస్ కింద వెల్లడించింది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌ వేదికగా స్పందించారు.

New Update
డ్రామారావు మరో డ్రామాకు తెరతీశారు: కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు

Drama Rao opens up to another drama: Revanth satires on KTR

నోటిఫికేషన్‌పై స్పందించిన రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ట్విటర్‌ రూపంలో కామెంట్స్‌ చేశారు. "తెలంగాణ డ్రామారావు మరో డ్రామా" అని తన ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు ఎక్స్‌ ట్విటర్‌ వేదికగా చురకలు అంటించారు. ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌ విషయంలో తెలంగాణను మభ్య పెడుతున్నారని.. ఏమార్చడంలో కేటీఆర్‌ సిద్ధహస్తుడంటూ రేవంత్‌రెడ్డి (revanthareddy)వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

తెలంగాణ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ కింద ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రకటిస్తోందని ఫోరం ఫర్‌గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీ) తెలిపింది. రాష్ట్రంలోకి రాని పెట్టుబడులు వచ్చినట్లు, లేని ఉద్యోగాలను (jobs) ఇచ్చినట్లు చెబుతోందని ఎఫీజీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి (padmanabhareddy)ఒక ప్రకటనలో తెలిపారు. 2023 జనవరి 2న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (ktr)మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్- ఐపాస్ కింద తెలంగాణలోకి రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 22.5 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయంటూ ప్రకటించారుని తెలిపారు. కానీ.. తాము ఆర్టీఐ ( rti)కింద పరిశ్రమల శాఖ నుంచి సమాచారాన్ని కోరగా.. రూ.2.67 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని, 17.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆ నొటిఫికేషన్‌లో వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు నికరంగా వచ్చిన ఉద్యోగాలు, పెట్టుబడుల గురించి ఇంతవరకు క్లారీటిగా చెప్పలేకపోయారని టీఎస్‌-ఐపాస్‌ తెలిపారు. రాష్ట్రంలోకి రాని పెట్టుబడులు, ఉద్యోగాలను వచ్చినట్లుగా పరిశ్రమల శాఖ చూపిస్తూ ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పిస్తోందని వారు తప్పుబట్టింది. టీఎస్‌-ఐపాస్ క్లియర్ చేసిన పరిశ్రమలు నిజానికి చాలావరకు పిండి మరలు పనులు, ఇటుక పనులు, స్టోన్ క్రషర్ వంటివి ఉన్నాయని వెల్లడించారు. ఇలాంటివి గతంలో కూడా ఉన్నాయని, కొత్తగా వచ్చినవేమీ లేవని ఎఫీజీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు.

పెద్దపెద్ద పరిశ్రమలు టీఎస్- ఐపాస్ (ts-ipass)కింద వచ్చినట్లు చెబుతున్నారని, నిజానికి మెట్రోరైలు, జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. వంటివి గతంలోనే పనులు మొదలు పెట్టాయని అన్నారు. రామగుండం ఎరువులు ఫ్యాక్టరీ, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లు, భారత్ డైనమిక్స్‌ను-ఐపాస్ కింద చూపించారని, కూడా టీఎస్ ఇవి ప్రభుత్వరంగ సంస్థలని, వీటికి రాష్ట్ర అనుమతులు కంటే కేంద్ర అనుమతులు అవసరమని వివరించారు. ఇక ఫీనిక్స్ కన్‌స్ట్రక్షన్, అపర్ణ హౌసింగ్, మైహోమ్ కన్‌స్ట్రక్షన్లను కూడా టీఎస్ - ఐపాస్ కింద చూపారని, వీటికి రియల్‌ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉందని, టీఎస్ ఐపాస్ ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని పరిశ్రమలశాఖ వారు తమ ఖాతాలో వేసుకుని ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రజలకు సరైన సమాచారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు