Atchannaidu: స్కిల్ స్కాంపై అచ్చెన్న చెప్పిన నిజాలు..!

‘‘స్కిల్‌పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడి చేయడమే’’ అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు పై కేసులో ఆధారాలు చేపలేక రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలే అక్రమాలు అని కట్టుకథ చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Atchannaidu: స్కిల్ స్కాంపై అచ్చెన్న చెప్పిన నిజాలు..!
New Update

స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ వారు తెలియజేస్తారని అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేశారని.. వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పడం, దానిని అక్రమ కేసులకు ముడిపెట్టడం ఏంటని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.

చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 28 రోజులవుతున్నా.. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు బయటపెట్టలేక చివరకు పార్టీకి వచ్చిన నిధులపై పడిందని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవడంలేదని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసేందుకు, ఆయన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేందుకు.. దర్యాప్తు సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Also Read: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వయాగ్రా లాంటివాడు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

#chandrababu #achchennaidu #tdp-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe