/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10.jpg)
Double Ismart Movie :ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ కి డేట్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ఈ వెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి అందరూ రావచ్చని నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు..' మాస్ ఫ్యాన్స్ అందరూ రావచ్చు.. వచ్చి మాస్ ఫీస్ట్ చేసుకుందాం' అంటూ పోస్ట్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు.
VIZAG ! See you tomorrow 😍🥳#DoubleiSmartTrailer Launch at Gurajada Kalakshetram, Vizag, 6PM Onwards🤩
Come let’s make this Sunday Super Massive with #DoubleiSmart ❤️#DoubleiSmartOnAug15pic.twitter.com/bxTO1sRXin
— Charmme Kaur (@Charmmeofficial) August 3, 2024
Also Read : ఆ విషయంలో చిరంజీవి కంటే ఆ హీరో బెటర్.. కీర్తి సురేష్ కామెంట్స్ ..!
మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.