Rythu Runa Mafi: రుణమాఫీ కానీ వారికి బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి!

TG: ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాని రైతుల ఇళ్లకు AEOలు వెళ్లనున్నారు. సర్వేలో కుటుంబ నిర్థారణ తర్వాత రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది.

New Update
Rythu Runa Mafi: రుణమాఫీ కానీ వారికి బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి!

Rythu Runa Mafi: ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ హామీని అమలు చేసింది రేవంత్ సర్కార్. మొత్తం మూడు దఫాలుగా రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే, కొన్ని టెక్నీకల్ తో వివిధ కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ జరగలేదు. దీంతో రైతులు గందగోళ పరిస్థితిలో ఉన్నారు. మూడు లిస్టులో అర్హుల జాబితాలో పేర్లు రాకపోవడంతో తమకు రుణమాఫీ జరగదా అనే ఆందోళనలు రైతులు ఉన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అందరికి రుణమాఫీ ప్రక్రియ అవుతుందని అన్నారు. అధికారులు నేరుగా ఊర్లోకి వచ్చి రుణమాఫీ కానీ వారి జాబితాను తీసుకుంటారని అన్నారు.

ఈరోజు నుంచే...

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభం అయింది. టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఏవోలు వెళ్లనున్నారు. రుణమాఫీ కాని రైతుల కుటుంబ నిర్దారణ సర్వే చేస్తున్నారు ఆఫీసర్లు. తెలంగాణ వ్యాప్తంగా 4.24 లక్షల రైతుల అకౌంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రైతుతో పాటు కుటుంబసభ్యులతో కలిసి ఫోటో యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. రైతుల నుంచి కుటుంబసభ్యుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రం అధికారులు తీసుకోనున్నారు. రుణ సమాచార పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం, ఫోటో, క్రాప్ లోన్ వివరాలను పంట భరోసా యాప్ లో అప్ లోడ్ చేయనున్నారు. కుటుంబ నిర్థారణ తర్వాత రుణమాఫీ నిధులని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది.

Advertisment
తాజా కథనాలు