Food Struck in Throat: గొంతులో ఆహారం ఇరుక్కుపోతే టెన్షన్‌ పడవద్దు..ఇలా చేయండి!

తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా కొన్నిసార్లు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో కార్బోనేటేడ్ డ్రింక్స్‌ , వెన్న లేదా నెయ్యి తీసుకుంటే గొంతులో ఇరుక్కుపోయిన ఆహారం కిందకి జారిపోతుంది. పెద్ద పెద్ద ముద్దలకు బదులు చిన్నగా నమిలి తింటే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

Food Struck in Throat: గొంతులో ఆహారం ఇరుక్కుపోతే టెన్షన్‌ పడవద్దు..ఇలా చేయండి!
New Update

Food Struck in Throat: తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా కొన్నిసార్లు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనలో చాలా మందికి ఆహారం గొంతులోనే ఆగిపోయిన అనుభవాలు చాలానే ఎదురై ఉంటాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో ఒక గ్లాసు నీరు తీసుకుని. 4-5 పెద్ద సిప్స్‌లో నీళ్లను తాగాలి. దీని వల్ల ఆహారం కడుపులోకి జారిపోతుంది. గొంతులో ఏదైనా ఆహారం ఉండిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్బోనేటేడ్ డ్రింక్స్‌ తాగాలి

  • మామూలుగా అయితే కార్బోనేటేడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ వీటిలో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల గొంతులోని ఆహారం వెంటనే విచ్ఛిన్నమై లోపలికి వెళ్లిపోతుంది.

వెన్న లేదా నెయ్యి

  • నెయ్యి లేదా వెన్న తినడం వల్ల ఆహారం గొంతులో చిక్కుకున్నప్పుడు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే గొంతులో ఇరుక్కుపోయిన ఆహారం కిందకి జారిపోతుంది. ఒక చెంచా నెయ్యి తింటే అన్నవాహికకు హైడ్రేషన్ అందుతుంది.

జాగ్రత్తలు

  • మన పెద్దలు కూడా తినేటప్పుడు నవ్వడం, టీవీ, మొబైల్‌ చూడటం చేయొద్దని ఎప్పుడూ చెబుతుంటారు. పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకునే బదులు చిన్నగా తీసుకుని బాగా నమిలి తింటే ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.

బోర్లా పడుకోబెట్టాలి

  • చిన్న పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కంటే కూర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే వీపుపై, పొట్ట మీద బత్తిడి పడి అడ్డు పడ్డ ఆహార పదార్థం బయటకు వస్తుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఇది తినండి..రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తింటే చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.. అవేంటో తెలుసుకోండి!

#health-benefits #food-struck-in-throat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe