Food Struck in Throat: గొంతులో ఆహారం ఇరుక్కుపోతే టెన్షన్ పడవద్దు..ఇలా చేయండి! తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా కొన్నిసార్లు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో కార్బోనేటేడ్ డ్రింక్స్ , వెన్న లేదా నెయ్యి తీసుకుంటే గొంతులో ఇరుక్కుపోయిన ఆహారం కిందకి జారిపోతుంది. పెద్ద పెద్ద ముద్దలకు బదులు చిన్నగా నమిలి తింటే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. By Vijaya Nimma 07 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Food Struck in Throat: తినేటప్పుడు మాట్లాడినా, నవ్వినా కొన్నిసార్లు తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనలో చాలా మందికి ఆహారం గొంతులోనే ఆగిపోయిన అనుభవాలు చాలానే ఎదురై ఉంటాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో ఒక గ్లాసు నీరు తీసుకుని. 4-5 పెద్ద సిప్స్‌లో నీళ్లను తాగాలి. దీని వల్ల ఆహారం కడుపులోకి జారిపోతుంది. గొంతులో ఏదైనా ఆహారం ఉండిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగాలి మామూలుగా అయితే కార్బోనేటేడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ వీటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల గొంతులోని ఆహారం వెంటనే విచ్ఛిన్నమై లోపలికి వెళ్లిపోతుంది. వెన్న లేదా నెయ్యి నెయ్యి లేదా వెన్న తినడం వల్ల ఆహారం గొంతులో చిక్కుకున్నప్పుడు తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే గొంతులో ఇరుక్కుపోయిన ఆహారం కిందకి జారిపోతుంది. ఒక చెంచా నెయ్యి తింటే అన్నవాహికకు హైడ్రేషన్ అందుతుంది. జాగ్రత్తలు మన పెద్దలు కూడా తినేటప్పుడు నవ్వడం, టీవీ, మొబైల్ చూడటం చేయొద్దని ఎప్పుడూ చెబుతుంటారు. పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకునే బదులు చిన్నగా తీసుకుని బాగా నమిలి తింటే ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. బోర్లా పడుకోబెట్టాలి చిన్న పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కంటే కూర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా చేస్తే వీపుపై, పొట్ట మీద బత్తిడి పడి అడ్డు పడ్డ ఆహార పదార్థం బయటకు వస్తుంది. ఇది కూడా చదవండి: చలికాలంలో ఇది తినండి..రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తింటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.. అవేంటో తెలుసుకోండి! #health-benefits #food-struck-in-throat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి