Dating : 30 ఏళ్లు దాటాక డేటింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి

చిన్న వయస్సులో డేటింగ్ చేయడం కంటే 30 ఏళ్ల వయస్సులో డేటింగ్ చేయడం చాలా భిన్నమైన అనుభవం. కొన్ని తప్పులు చేయడం వల్ల నష్టాలు ఉంటాయి. ఏదైనా సంబంధం పెట్టుకునేప్పుడు ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు.

New Update
Dating : 30 ఏళ్లు దాటాక డేటింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి

Don't Do These Mistakes : 30 సంవత్సరాల వయస్సులో డేటింగ్(Dating) చేసే వ్యక్తులు జీవితంలో ఎక్కువ అనుభవం కలిగి ఉంటారని, సంబంధంలో ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసని అంటుంటారు. అయితే కొన్ని తప్పులు(Mistakes) చేయడం వల్ల నష్టాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. చిన్న వయస్సులో డేటింగ్ చేయడం కంటే 30 ఏళ్ల వయస్సులో డేటింగ్ చేయడం చాలా భిన్నమైన అనుభవం. 30 ఏళ్ల(30 Years Old) లో డేటింగ్ చేసే వ్యక్తులు జీవితంలో ఎక్కువ అనుభవం కలిగి ఉంటారని అంటున్నారు.అయితే ఈ సమయంలో అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 30 ఏళ్లలో అత్యంత సాధారణ డేటింగ్ తప్పు ఏంటంటే ప్రాధాన్యతలను, విలువలను విస్మరించడం.

Dating

మీ భాగస్వామిలో మీరు వెతుకుతున్న దాని గురించి మీకు మంచి అవగాహన ఉండాలి. మీ ప్రాధాన్యతలు, విలువలపై రాజీ పడకుండా ఉండటం ముఖ్యం. చాలా తరచుగా ఒంటరితనం భయం కారణంగా ప్రజలు విలువలు మర్చిపోతుంటారు. ఏదైనా సంబంధం పెట్టుకునేప్పుడు ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. 30 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవాలని ఎక్కువ మంది ఒత్తిడి చేస్తుంటారు. భాగస్వామితో డేటింగ్ చేయడం, అతడు లేదా ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం. తొందరపడి ఒప్పుకోవడం వల్ల తర్వాత పశ్చాత్తాపపడవచ్చని నిపుణులు అంటున్నారు.

Dating

ఈ వయస్సులో ఇతర వ్యక్తులతో ఏ రకమైన పోలిక అయినా భావోద్వేగాన్ని పెంచుతుంది. కోపంలో చెడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి తన స్వంత ఇష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. పని, జీవితం(Life) మధ్య 30 ఏళ్లలో మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయడం చాలా సులభం. అయితే ఆరోగ్యకరమైన డేటింగ్ కోసం జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ కోసం, మీ స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. దీనివల్ల సంతోషంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కొన్ని పాత జ్ఞాపకాలు(Old Memories) ఉంటాయి. కానీ ఆ పాత జ్ఞాపకాలతో భవిష్యత్ ముడిపడి ఉంటుది. సంబంధాల్లో కూడా జ్ఞాపకాలు చెడు ప్రభావం చూపుతాయి. అందుకే కొత్త సంబంధంలోకి ప్రవేశించే ముందు పాత జ్ఞాపకాల నుంచి బయటపడాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వ్యాయామం చేసేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగకూడదా?..ఏమౌతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు