Wisdom Teeth Removed: తొందరపడి జ్ఞానదంతం తొలగించుకోవద్దు..వైద్యులు ఏమంటున్నారంటే

జ్ఞానదంతంలో కొన్నిసార్లు విపరీతంగా నొప్పి వస్తుంటుంది. అది పెరిగే సమయంలో వంకరగా రావడం వల్ల ఇలా జరుగుతుంది. తొందరపడి దంతం తీసేయొద్దని వైద్యులు అంటున్నారు. పుదీనా, లవంగాలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలతో నొప్పిని సులభంగా తగ్గుతుంది.

New Update
Wisdom Teeth Removed: తొందరపడి జ్ఞానదంతం తొలగించుకోవద్దు..వైద్యులు ఏమంటున్నారంటే

Wisdom Teeth Removed: అనేక మందికి జ్ఞానదంతంలో ఒక్కసారిగా నొప్పి వస్తూ ఉంటుంది. ఓ వయసు వచ్చాక జ్ఞానదంతం పెరుగుతుంది. కొందరిలా ఈ దంతం వంకరగా వస్తుంది. దీని వల్ల విపరీతమైన నొప్పి( pain) ఉంటుంది. అందుకే డాక్టర్‌ను సంప్రదించి దాన్ని తీసేయించుకుంటూ ఉంటారు. అయితే జ్ఞానదంతాన్ని తీసి వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతకాలం అలా వేచి ఉంటే అది సెట్‌ అయిపోయి నొప్పి కూడా తగ్గుతుంది. అయితే తీవ్రమైన నొప్పిని భరించలేక ఎక్కువమంది జ్ఞానదంతం తొలగించుకోవడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జ్ఞానదంతం (Wisdom Teeth) నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: పాదాల నొప్పి ఇబ్బంది పెడుతుందా..? ఈ చిట్కాలతో నొప్పి పరార్
కొన్ని పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి నమిలి మింగాలి. అలా నమిలేటప్పుడు వచ్చిన రసం మొత్తం నోటిలో అంటే విధంగా చూసుకోవాలి. దీంతో నొప్పి తొందరగా తగ్గిపోతుంది. పుదీనాలో నొప్పిని నివారించే గుణాలు ఉంటాయి. రోజులో మూడుసార్లు ఈ విధంగా చేస్తే నొప్పి మాయం అవుతుంది. అలాగే లవంగాల నుంచి చేసిన నూనెలో కొంచెం కాటన్‌ను నానబెట్టాలి. గంట తర్వాత దాన్ని నొప్పి ఉన్న దగ్గర ఉంచుకోవాలి.
జ్ఞానదంతం వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం
అలా ఒక పావుగంట పాటు ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. రోజులో నాలుగుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఉల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీతో పాటు నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. అందుకే ఒక చిన్న ఉల్లిని సగం కట్‌ చేసుకుని నోటిలో పెట్టుకుని బాగా నమిలి మింగాలి. మింగేటప్పుడు ఆ రసం నొప్పి ఉన్న దగ్గరికి చేరేలా చూసుకోవాలి. రోజులో రెండుసార్లు ఇలా చేయవచ్చు. కప్పు గోరువెచ్చని నీళ్లలో ఉప్పు (salt) కలిపి నోటిలో వేసుకుని పుక్కిలించి ఊయాలి. ఇలా రోజులో రెండుసార్లు చేస్తే జ్ఞానదంతం (Wisdom Teeth) వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు