Childrens Room: పిల్లల గది డిజైనింగ్ విషయంలో ఇవి మర్చిపోకండి పిల్లల గది విషయంలో పెద్దలు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లల రూమ్‌ని సింపుల్‌గా డిజైన్ చేయాలి. బొమ్మలకు సరైన స్థలం కేటాయించాలి. అనవసరమైన వస్తువులకు స్థలం వదలొద్దు. బట్టలు ఉంచడానికి ప్లేస్ పెట్టాలి. పిల్లల గదిలో గోడ రంగులు కాంతివంతంగా ఉండేలా చూసుకోండి. By Vijaya Nimma 14 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Childrens Room: ఇంటిని నిర్మించే ముందు చాలా విషయాలపై శ్రద్ధ చూపుతాం. అదే విధంగా పిల్లల గది విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాలి. పిల్లల గదిని నిర్మించే ముందు సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. సింపుల్‌గా డిజైన్ చేయాలి: పిల్లల గదిని అతిగా అలంకరించడం మంచిది కాదు. దీన్ని చాలా సింపుల్‌గా ఉంచడం మంచిది. మంచం, బెడ్, దుప్పటి, గోడల రంగు పిల్లల ఇష్టానికి తగినట్టు ఏర్పాటు చేయాలి. బొమ్మలకు సరైన స్థలం కేటాయించాలి: పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారికి ఇష్టమైన బొమ్మలను గదిలో ఉంచడం, చక్కని కళాకృతులను ఉంచడం ద్వారా పిల్లలకు ఒక మంచి ఫీల్ కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పిల్లలు గదిలోకి వెళ్లడానికి ఇష్టపడేలా ఒక ప్లే గ్రౌండ్ వాతావరణం కల్పించాలి. అనవసరమైన వస్తువులకు స్థలం వదలొద్దు: పిల్లల గదిని ఎక్కువగా సామాన్లతో నింపడం మానుకోండి. పిల్లలకు ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ అవసరం. కాబట్టి గదిలో ఎక్కువ స్థలం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి. అంతేకాకుండా గది మొత్తం శుభ్రంగా, చక్కగా కనిపించాలి. దీని కోసం ఏది ఎక్కడ ఉంచాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. బట్టలు ఉంచడానికి స్థలం: పిల్లలకు బట్టలను అందుబాటులో ఉంచడానికి మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. పిల్లలకు తమ బట్టలను సరిగ్గా మడతపెట్టడం, ఎలా ఉంచుకోవాలో తెలియదు కాబట్టి సౌకర్యవంతమైన హ్యాంగింగ్ స్టోరేజ్ సిస్టమ్ పెట్టించుకోవాలని నిపుణులు అంటున్నారు. రకరకాల రంగులు: పిల్లలకు రంగులు అంటే చాలా ఇష్టం. కాబట్టి గదిని రంగుల మయం చేయాలి. వివిధ రంగుల సీటింగ్, బొమ్మలు లేదా వాల్ హ్యాంగింగ్‌లు ఏర్పాటు చేయాలి. బెడ్‌ను కూడా కాస్త డిఫరెంట్‌గా ఏర్పాటు చేయాలి. పిల్లల గదిలో గోడ రంగులు మంచి కాంతివంతంగా ఉండేలా చూసుకోవాలికు కాంతి నీడ రంగు ఇవ్వడం ఎల్లప్పుడూ మంచిది. అటువంటి లైట్ షేడ్స్‌తో ఇతర వస్తువుల రంగులు అనుకూలంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం చాలా అవసరం. ఇది కూడా చదవండి: వేలిని బట్టి మనిషి తెలివితేటలు అంచనా వేయొచ్చా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #childrens-room #designing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి