Water: బరువు తగ్గాలంటే.. నీళ్లు బాగా తాగండి!

కొంతమందికి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారట. మనం తిన్న ఆహారంలో ఉప్పు ఉంటుంది. నీరు తక్కువ తాగే వారికి ఉప్పు లోపల పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో రోజుకు నాలుగైదు లీటర్లు తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

Water: బరువు తగ్గాలంటే.. నీళ్లు బాగా తాగండి!
New Update

Water: ప్రస్తుత కాలంలో బరువు తగ్గాల అనేది పెద్ద టాస్క్. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో ఎక్సర్సైజ్‌లు, యోగా, వాకింగ్ లాంటివి చేస్తుంటారు. అయినా కానీ బరువు కంట్రోల్లో ఉండదు. వీటన్నిటికీ కారణం జీవనశైలి. అయితే లైఫ్‌స్టైల్‌తోపాటు చిన్న చిన్న పొరపాట్లు కూడా దీనికి కారణం. అందులో ఒకటి నీరు తాగకపోవడం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఉప్పుతో ఉన్న ఆహారాలను దూరం పెట్టి.. నీటిని ఎక్కువగా తీసుకోండి. చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటారు. అలాంటి వారికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనం తీసుకునే నీటికి ఉప్పుకి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు వల్ల కూడా శరీరంలో బరువు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక నీటికి ఉప్పుకి ఉన్న మధ్య సంబంధం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

publive-image

కొంతమందికి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. రోజుకి అర లీటర్, లీటర్ తాగుతారు. కొంతమంది రెండు లీటర్ల లోపు తాగుతారు. నీరు తక్కువ తాగడం వలన మన శరీరం బరువు పెరుగుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఉప్పు ఉంటుంది. నీరు తక్కువ తాగే వారికి ఉప్పు లోపల పేరుకుపోతుది. శరీరంలో ఒక గ్రాము ఉప్పు లోపల పేర్కొందంటే 80 గ్రాముల నీటిని శరీరంలో నిలువ చేస్తుంది. ఒక్కరోజు ఒక నాలుగు గ్రాముల ఉప్పు ఎక్కువ నిల్వ చేశామంటే.. యూరిన్ సరిగా పాస్ చేయకపోయినా.. చెమట ఎక్కువ పట్టకపోయినా.. 300 గ్రాములు ఒంట్లో నీటి బరువు పెరిగిపోతుంది. అందుకని మంచి నీళ్లు బాగా తాగే అలవాటు ఉన్న వారి కంటే.. రోజుకు నాలుగైదు లీటర్లు తాగితే యూరిన్ రోజుకు రెండు, రెండున్నర లీటర్ల వెళ్లిపోతుంది. దీనివల్ల ఎక్సెస్ సాల్ట్‌తో పాటు ఎక్సెస్ వాటర్ కూడా వెళ్లి బరువు బాగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగండి!

#water
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe