Relationship: అనుమానం వద్దు.. నమ్మకమే ముద్దు.. మీరు అలా చేయకండి!

కొంతమంది తమ లవర్‌ని లేదా లైఫ్‌ పార్టనెర్‌ని పదేపదే అనుమానిస్తుంటారు. తమతో కాకుండా ఎవరితో మాట్లాడినా సహించలేకపోతారు. ఫోన్‌ బిజీ వచ్చినా డౌట్ పడతారు. ఇలా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. మీ భాగస్వామీకి మీరు పరిచయం కాకముందే వేరే ప్రపంచం కూడా ఉండేదని గుర్తుంచుకోండి.

New Update
Relationship

Relationship: మనిషి జీవితంలో అనుమానం అనేది సహజం. ఇక భాగస్వామి విషయంలో పదేపదే అనుమానించినప్పుడు, అధిక ప్రశ్నలు అడిగినప్పుడు, అది వారి అభద్రతా భావానికి సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు. కొంతమందికి తమ భాగస్వామి ఫోన్ బిజీగా ఉన్నప్పుడు కూడా అనుమానిస్తుంటారు. భాగస్వామి జీవితంలో మీ కంటే ముందే కొంత మంది స్నేహితులు, బంధువులు, వ్యక్తులు ఉన్నారని వారు గమనిచాలి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎంతో ఉపయోగకరంగా ఉంది. కొంతమంది ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతారు. ఈ రకమైన సంబంధాలలో.. సంబంధం కొత్తగా ఉన్నప్పుడు, వ్యక్తులు పరిచయాలు వలన ఒకరితో ఒకరు గంటల కొద్దీ మాట్లాడుకుంటారు. ఈ సమయంలో మాత్రం జీవిత భాగస్వామికి సరైన సమయం ఇవ్వలేకపోతున్నారు. భాగస్వామిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి :  వీటిపై ఫోకస్‌ పెట్టి చూడండి.. పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం

భాగస్వామిని అనుమానించే విషయాలు ఇవే:

  • భాగస్వామి వారి స్నేహితులతో నవ్వుతూ, బహిరంగంగా మాట్లాడినప్పుడు, ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వంటి ఈ విషయాల గురించి చాలామంది బాధపడతారు. ఈ సమయంలో మనస్సు వారి స్నేహం గురించి ఆలోచిస్తారు. కొంత మంది ఇలాంటి అనేక విషయాలు చెబుతారు. అయితే ఇలా మాట్లడినప్పుడు ఇది భాగస్వామిని చెడుగా భావించి.. వారి సంబంధాన్ని చెడగొడుతుందని నిపుణులు అంటున్నారు.

సంబంధాలు శాశ్వతంగా విచ్ఛిన్నమవుతాయి:

  • అందువల్ల.. భాగస్వామిని నమ్మలి ఇలా చిన్న విషయాలు అనుమానించడం వంటివి చేయకుడదంటున్నారు. కొన్ని విషయాలను భాగస్వామితో నేరుగా మాట్లాడాలి. అనేక సంబంధాలలో పెరుగుతున్న అభద్రత వలన తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సంబంధాలు శాశ్వతంగా విచ్ఛిన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఇంటర్‌నెట్‌ వద్దు.. ఆటలే ముద్దు.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాల్సిందిదే!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు