Pregnant Women: గర్భిణుల కోరికలను కాదనకూడదట..ఎందుకో తెలుసా?

గర్భంతో ఉన్న సమయంలో తల్లిలో చాలా మార్పులు వస్తాయి. కడుపులో బిడ్డ పెరగడంతో, బిడ్డ కదలికలను బట్టి తల్లికి కూడా ఏం తినాలో కోరికలు పుడతాయి. అందుకే తల్లి ఏం అడిగినా వెంటనే తెచ్చిపెడితే కడుపులో ఉన్న శిశువు కూడా సంతోష పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

New Update
Pregnant Women: గర్భిణుల కోరికలను కాదనకూడదట..ఎందుకో తెలుసా?

Pregnant Women:మహిళ గ‌ర్భం దాల్చిందని తెలియగానే ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాలు కిందపెట్టకుండా సపర్యలు చేస్తుంటారు. కోరిందల్లా తెచ్చి ముందు పెడుతుంటారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ తల్లితో పాటు కడుపులో బిడ్డను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ ఉన్నవారు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.

publive-image

డెలివరీ అయ్యే వరకు అలాగే కాపాడుతారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు నిత్యం పోషకాలు ఉన్న ఆహారాలు అందిస్తారు. కడుపులో ఉన్న సమయంలో మహిళలకు సాధారణంగా అనేక పదార్థాలు తినబుద్ది అవుతుంటుంది. అందుకే ఏం అడిగినా కుటుంబ సభ్యులు కాదనరు. గర్భంతో ఉన్న సమయంలో తల్లిలో చాలా మార్పులు వస్తాయి. అందుకే ఏమి అడిగినా కాదనకూడదని పెద్దలు అంటుంటారు.

publive-image

గ‌ర్భం దాల్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మహిళలకు చాలా ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంటుంది. పుల్లటివి ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే వారి కడుపులో బిడ్డ పెరగడంతో తల్లిలో ఇలాంటి మార్పులు సహజం అని వైద్యులు అంటున్నారు. బిడ్డకు అందే పోషకాలు కూడా తల్లి తినేదాన్ని బట్టి ఉంటుందని, బిడ్డ కదలికలను బట్టి తల్లికి కూడా ఏం తినాలో కోరికలు పుడతాయని అంటున్నారు. అందుకే తల్లి ఏం అడిగినా వెంటనే తెచ్చిపెడితే కడుపులో ఉన్న శిశువు కూడా సంతోష పడుతుందని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కుక్క కోసం వెతుకుతున్న ఓనర్‌కు కెమెరాలో కనిపించిన షాకింగ్‌ ఘటన

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు