ఊటీ లో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన అక్కడి అధికారులు..

వేసవి తాపాన్ని తప్పించుకోవటానికి..కొద్ది రోజులు సేదతీరటానికి ఊటీకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి ఎందుకంటే..భారీ వర్షాలు కారణంగా అక్కడి అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

New Update
ఊటీ లో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన అక్కడి అధికారులు..

వేసవి వచ్చిందంటే చాలు..చాలా మంది ఊటీ కొడైకెనాల్ వైపు పరిగెత్తుతుంటారు.పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్న ఊటీ ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతుంది.దీంతో అక్కడి అధికారులు మూడు రోజుల పాటు ఊటీకి రావద్దని పర్యాటకులకు ఆంక్షలు విధించారు.

ఊటీ ఉన్న నీలగిరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యాటకులు వెళ్లవద్దని కలెక్టర్ అరుణ ప్రకటించారు. నీలగిరి జిల్లాలో భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా అరుణ ఈ ప్రకటన విడుదల చేశారు.తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వేసవి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రకారం నేటి నుంచి మరో 5 రోజుల పాటు తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. 20న భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. నీలగిరి తమిళనాడులోని ఆరెంజ్ అలర్ట్ జిల్లా కూడా. నీలగిరి కొండ ప్రాంతం కావడంతో అక్కడ చేపట్టాల్సిన ముందస్తు పనులపై కలెక్టర్ అరుణ ఈరోజు అన్ని శాఖల అధికారులతో సమాలోచనలు జరిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు